Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

గ్రంధాలయలను ఆధునికరిస్తాం:జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్. మధుబాల.

జానం,న్యూస్, పీలేరు, నవంబర్16:-ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శాఖా గ్రంథాలయాలకు రూ.30 కోట్లు బకాయీలు రావాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు ఎన్. మధుబాల తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల పర్యవేక్షణలో భాగంగా  ఆమె రాష్ట్ర గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డితో కలిసి గురువారం సాయంత్రం పీలేరు శాఖా గ్రంధాలయనిసందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 71 గ్రంథాలయాలకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయితీల నుంచి సెస్సు రూపంలో వసూలు చేసిన రూ.30 కోట్ల మేరకు అందాల్సి ఉందని అన్నారు.అందులో కనీసం 10కోట్ల మేర  బకాయిలు వచ్చిన గ్రంధాలయలను ఆధునికరిస్తామని తెలిపారు. ఈ బకాయిలన్నీ ఆయా పంచాయతీ ల ద్వారా రావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలోజిల్లా గ్రంధాలయ కార్యదర్శి శర్మ,పీలేరు గ్రంధాలయధికారి అమరనాధ్ తతితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పీలేరు నియోజకవర్గం అభివృద్ధి; ఏపీసీసీ మీడియా చైర్మన్ ఎన్.తులసి రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఎంపీ నిధులతో దివ్యాంగుడికి త్రిచక్ర స్కూటీ పంపిణీ – రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతుల మీదుగా అందజేత

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment