Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

రేగల్లు లో ఘనంగా “నా మట్టి-నా దేశం” కార్యక్రమం

జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 25: స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం అని పీలేరు మండల పరిషత్ అధికారి డాక్టర్ టి.మురళి మోహన్ రెడ్డి, కలికిరి ఐటిబిపి ఇన్స్పెక్టర్ వైవీ రెడ్డి అన్నారు.బుధవారం పీలేరు మండలం రేగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలికిరి ఐటిపిపి ఆధ్వర్యంలో “నా మట్టి-నా దేశం” కార్యక్రమం ఘనంగా జరిగింది.పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీలేరు మండల పరిషత్ అధికారి డాక్టర్ టి.మురళి మోహన్ రెడ్డి మరియు ఐ.టి.బి.పి ఇన్స్పెక్టర్ వైవీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో నిర్వహింప బడుతుందని అన్నారు.మన రాజధాని అయిన ఢిల్లీ లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ ఆవరణలో గల ఉద్యానవనంలో సేకరించిన మట్టిని వేయడం జరుగుతుందని తెలిపారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుపుకుంటామని అన్నారు. రేగల్లు బాలంవారిపల్లి సచివాలయ పరిధిలోని వాలంటీర్లు గ్రామాల నుండి పిడికెడు మట్టిని కలశంలో తీసుకువచ్చి ఐటిబిపి వారికి అందజేశారు. రేగళ్ల పురవీధులలో విద్యార్థులచే నినాదాలు ఇస్తూ డప్పు వాయిద్యాలతో  భారి ర్యాలీ నిర్వహించారు. అనంతరం రేగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరింపజేసాయి. విద్యార్థుల భారతమాత, స్వాతంత్ర సమరయోధుల వేషధారణ అందర్నీ ఆకర్షించాయి. అనంతరం విద్యార్థులచే “పంచ్ ప్రాన్” ప్రతిజ్ఞ చేయించారు.పై కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే.పార్వతమ్మ, ఉపాధ్యాయులు జ్ఞాన ప్రకాష్, తెలుగు పండితులు మస్తాన్ ఖాన్, ఆది కేశవులు నాయుడు, శ్రీనివాసులు, గుల్నార్ బేగం, రేగల్లు సచివాలయం కార్యదర్శి అయ్యప్ప, వెల్ఫేర్ అసిస్టెంట్స్ వినాయకం ప్రకాష్, నటరాజ్, డిజిటల్ అసిస్టెంట్స్ నురుల్లా, బాల మురళి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శివప్రసాద్ రాజు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కీర్తి, మహిళా పోలీస్ ఆఫ్రిన్, కలికిరి ఐటిబిపి సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

కలికిరి ఎస్టీ కాలనీలో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు 

పీలేరు శ్రీ భువన విద్యాలయం విద్యార్థులకు జవహర్ నవోదయలో ప్ర‌వేశం – ‘శ్రీ భువన విద్యాలయం’కు గర్వకారణమైన ఘనత

Dr. Gangi Reddy Janam Chief Editor-

రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా REAL ఎస్. రామారావు ఎంపిక

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment