Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్రాజకీయం

నేనెప్పుడూ డబ్బుకు దాసోహం కాదు: జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ

జానం న్యూస్,పీలేరు సెప్టెంబర్ 28: తనపై దుష్ప్రచారం బాధాకరమని పీలేరు వైసిపి సీనియర్ నాయకులు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ షఫీ అలియాస్ షామియానా షఫీ అన్నారు.స్థానిక పట్టణం, ప్రకాశం రోడ్ లోని తన షామియానా దుకాణం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గత 35 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయుడునని భవిష్యత్తులో కూడా వారి అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఎదురొడ్డి  సర్పంచ్ గా పోటీ చేశాను వారి అధికారంలో బలముతో వారి అభ్యర్థిని గెలిపించుకున్నారు. 2014లో, 2019లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున కృషి చేశానని అన్నారు. పార్టీకి తను చేస్తున్న సేవకు, విధేయతను గుర్తించిన పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు ఈసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన భార్య వైస్ సర్పంచి అయిన నేపథ్యంలో రెండున్నర సంవత్సరాల తర్వాత  సర్పంచిగా నియమిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అది వారి ఇష్టం.కానీ కొంతమంది తాను డబ్బుకు లొంగిపోయి తన భార్యకు సర్పంచి పదవిని వదులుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. సమాజంలో తనను అగౌరవపరుస్తున్నారు. ఇది తనకు మనోవేదనకు గురి చేసిందని ఆవేదన చెందారు.ఈ రోజు ప్రవక్త పుట్టినరోజు మరియు మరణించిన రోజు అయిన ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ పవిత్రమైన రోజు ప్రమాణం చేస్తున్నాను తాను ఎవరి నుండి డబ్బు తీసుకోలేదు. తన స్వార్థం కోసం ఎవరిని ప్రలోభ పెట్టలేదు. అలా ఎవరైనా నిరూపించిన ఎడల తాను ఎటువంటి శిక్షకైనా సిద్ధమని రాజకీయాలనుండి శాశ్వతంగా పూర్తిగా వైదొంగతానని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

మిత్రుల సమక్షంలో ఘనంగా కర్రే రఘురాం జన్మదిన వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర రెడ్డి దాతృత్వం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు ఎం.ఎన్.ఆర్ తిరుమల అపార్ట్మెంట్స్‌లో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment