పీలేరులో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం
పీలేరు, ఆగస్టు 25(జానం న్యూస్):
నాణ్యమైన వైద్య ఆరోగ్య సేవల నిర్వహన కై క్షేత్రస్థా యి సిబ్బంది మేలైన నైపు ణ్యత కలిగి ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం అధికారి డా: బి.రమేష్ బాబు సూచించారు.
మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తలుపుల పరిధిలోని కావలిపల్లె సచివాలయం పరిది ఆరోగ్య సేవలు సమగ్ర తనిఖీలు నిర్వహించారు.

వైద్య మరియు ఆరోగ్య సేవలు ఏపీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలకనుగు ణంగా నాణ్యతను మెరుగు పరిచే లక్ష్యంతో
గర్భిణీ సేవలు మరియు కౌమార బాలికలకు హెచ్ బి నిర్దారణ పరీక్షల నిర్వహ ణ, ఎం.సి.పి కార్డుల వాస్తవ ధ్రువీకరణ, ఆర్.సి.హెచ్ మరియు హెచ్.ఎం.ఐ.ఆర్ సంబంధిత రికార్డ్స్,రిపోర్ట్స్ మరియు ఆన్లైన్ వాస్తవ ధ్రువీకరణ, మొదలగు అంశాలపై పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు, మరింత మెరుగైన రికార్డ్స్,రిపోర్స్ రూపుకల్పనకై టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం అధికారి డా:బి.రమేష్ బాబు ,డి.పి.యంఓ, డా:చంద్రశేఖర్ యం.ఓ, జి.ఓబుల్ రెడ్డి గణాంక అధికారి , మునీశ్వర్ జిల్లా ప్రోగ్రాం అధికారి,మొదలగు వారు నిర్దేశించిన అంశాలపై సిబ్బందికి సూచన సలహాలిచ్చారు.
కార్యక్రమంలో డా:చంద్రశేఖర్,యం ఓ, పిహెచ్ యన్ కుసుమ, శ్రీనివాసులు,పర్యవేక్షకులు నాగమ్మ,రెడ్డెప్ప,ఏ యన్ యం అరుణ,నూర్జహన్,భార్గవి,సౌజన్య,అయేషా,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

