Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

జానం న్యూస్, పీలేరు, సెప్టెంబర్ 26: పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ మోహన్ రెడ్డి, ఎస్సై నరసింహుడు తమ సిబ్బంది రంగారావు, ఫైరోజ్, కాదర్ వలి, నాగరాజు లతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించడం జరిగింది. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై బొడుమల్లువారిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల పీలేరు పరిసర ప్రాంతాలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పై రోడ్డు ప్రమాదంలలో వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయానని అన్నారు. హెల్మెట్ లేకుండా మోటార్ సైకల్ లను నడుపరాదని, ఇకపై రోడ్డు ప్రమాద భాధ్యులపై కఠిన చర్యలు వుంటాయని వారు హెచ్చరించారు. పీలేరు పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని పట్టణంలో 30 కిలోమీటర్ల వేగానికి మించి పోరాదని అన్నారు. పోలీసులు ప్రతి రోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా కొంతమంది యువకులు అతివేగంగా వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇతర అమాయకుల ప్రాణాలను కూడా తీస్తున్నారని అన్నారు. వాహనదారులు అతివేగంగా పోయినా,ట్రిపుల్ రైడింగ్ చేసినా, హెల్మెట్ ధరించుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

రేగల్లు లో ఘనంగా “నా మట్టి-నా దేశం” కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిత్తూరులో ఘనంగా జాతీయ మామిడి దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు డి.ఎఫ్.ఓ సంచారదళ నిఘా విభాగం ఆధ్వర్యంలో  రూ.17 లక్షల విలువ గల ఎర్రచందనం దుంగలు, వాహనం స్వాధీనం,

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment