Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

సైనింగ్ స్టార్‌కు ఎంపికైన రాయచోటి వైష్ణవి స్టడీ సెంటర్ విద్యార్థులు

సైనింగ్ స్టార్‌కు ఎంపికైన రాయచోటి వైష్ణవి స్టడీ సెంటర్ విద్యార్థులు

రాయచోటి, జూలై 20(జానం న్యూస్):

మదనపల్లిలోని ఎన్.జే.ఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించిన “సైనింగ్ స్టార్” కార్యక్రమంలో రాయచోటి పట్టణానికి చెందిన వైష్ణవి స్టడీ సెంటర్‌కు చెందిన ముగ్గురు ప్రతిభావంతులైన విద్యార్థులు ఎం. జష్ణిక, ఎన్. యశ్వంత్ రెడ్డి మరియు జి. కీర్తన తమ విశిష్ట ప్రతిభతో సైనింగ్ స్టార్‌గా ఎంపికై ఘన సత్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, రూ.20,000 విలువైన చెక్కులు మరియు జ్ఞాపిక మెడళ్లను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, “విద్యార్థులు చిన్న వయస్సులోనే లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత” అని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు విద్యాసంస్థలు కూడా విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, “పట్టుదల, నిరంతర శ్రమ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థులు ఇలాంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ అవార్డు వారి భవిష్యత్ విజయాలకు తొలి మెట్టు కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ఎం. జష్ణిక, ఎన్. యశ్వంత్ రెడ్డి మరియు జి. కీర్తన మాట్లాడుతూ, “ఈ గుర్తింపు తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, తమ విజయానికి కారణమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు వైష్ణవి స్టడీ సెంటర్ యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను సాధించి విద్యాసంస్థకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని” పేర్కొన్నారు.

ఈ విజయంతో వైష్ణవి స్టడీ సెంటర్ ఉపాధ్యాయ బృందం, యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభకు లభించిన ఈ గుర్తింపు సంస్థకు గర్వకారణమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు విజేతలను అభినందించి వారి విద్యాభ్యాసంలో మరింత పురోగతి సాధించాలని ఆశీర్వదించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

Students should grow as scientists: Piler MEOs are Lokeshwar Reddy and Padmavathi.

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాల్మీకిపురం 1980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం – మధుర జ్ఞాపకాల మధ్య షష్టిపూర్తి వేడుక

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరులో స్వాతంత్ర దినోత్సవ సమైక్య సంబరాలు.. పట్టణంలో వంద అడుగుల జాతీయ జెండాతో “హర్ ఘర్  కా తిరంగా” ర్యాలీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment