Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: జానం సుజాత

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: జానం సుజాత

కలికిరి, జూలై 15(జానం న్యూస్): స్థానిక ఇందిరమ్మ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా బుధవారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి అతుల్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత లో భాగంగా వివిధ రకాలైన సుమారు 150 మొక్కలను ఉచితంగా అందజేసింది. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయిని జానం సుజాత మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పర్యావరణంపై అవగాహన పెంపొందించుకొని ప్రతి సంవత్సరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పాఠశాలకు వివిధ రకాలైన  150 మొక్కలను ఉచితంగా అందజేసిన అతుల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఫిజికల్ డైరెక్టర్ రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకాన్ని ఉద్యమంలా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

oplus_18

ఈ కార్యక్రమంలో అతుల్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు దేవా, డోనాల్డ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

‘నెహ్రు విద్యాలయ సమితి’ సౌత్ ఇండియా స్థాయి రన్నింగ్ రేస్ లో పీలేరు రేసు’గుర్రం సిద్ధార్థ’

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పేదల ఆరాధ్య దైవం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి:పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment