Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

మిత్రుల సమక్షంలో ఘనంగా కర్రే రఘురాం జన్మదిన వేడుకలు

మిత్రుల సమక్షంలో ఘనంగా కర్రే రఘురాం జన్మదిన వేడుకలు

వాల్మీకిపురం, జూలై 10 (జానం న్యూస్):

వాల్మీకిపురం గాంధీ బస్టాండ్‌లోని ఎస్.ఎల్.ఎన్  మెడికల్ షాప్‌లో శుక్రవారం సాయంత్రం ప్రముఖ సామాజిక సేవాభిలాషి, స్నేహశీలి కర్రే రఘురాం 61వ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కర్రే రఘురాం కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కేక్ పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు స్వీకరించారు. అనంతరం మిత్రులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మిత్రులు, కర్రే రఘురాం స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తి అని, అందరితో ఆప్యాయంగా మెలుగుతూ అవసరంలో ఉన్న వారికి తనవంతు సహాయం అందించే మంచి మనసున్న వ్యక్తిగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

కర్రే రఘురాం మాట్లాడుతూ, తన జన్మదినాన్ని పురస్కరించుకుని విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిత్రుల ప్రేమాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని పేర్కొంటూ, జీవితాంతం అందరి ఆప్యాయతను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సి.వి. రమణ, బంగారు రెడ్డప్ప, సయ్యద్ భాష, గ్రామీణ బ్యాంక్ అప్రైజర్ రవి, కుమార్, లేడీస్ టైలర్ సయ్యద్ భాష, ప్రాథమిక చికిత్సాలయ నిర్వాహకుడు జయరాం తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన – 42 మందికి శస్త్రచికిత్సల ఎంపిక

Dr. Gangi Reddy Janam Chief Editor-

VSN students should rise to the level of ISRO scientists: V.Madhavi, Correspondent of VSN Siddhartha Educational Institutions, calls on students

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment