Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల భవిష్యత్తుకు ఎస్.వి విద్యా మందిర్ మరో ముందడుగు

విద్యార్థుల భవిష్యత్తుకు ఎస్.వి విద్యా మందిర్ మరో ముందడుగు

సైనిక్ స్కూల్–నవోదయ ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు స్కాలర్‌షిప్ టెస్ట్.. 120 మంది విద్యార్థుల హాజరు

మెరిట్ విద్యార్థులకు 100% ఉచిత కోచింగ్, ఫీజు రాయితీలు.. సమగ్ర శిక్షణతో జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం

రాయచోటి,  జూన్ 28(జానం న్యూస్):
రాయచోటి కొత్తపేటలోని ఎస్.వి విద్యా మందిర్ హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక్ స్కూల్ – నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల కోచింగ్ స్కాలర్‌షిప్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ పరీక్షకు దాదాపు 120 మంది విద్యార్థులు హాజరుకావడం విశేషం. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.


ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.సుధాకర్ రెడ్డి మరియు సెక్రటరీ డాక్టర్ ఎన్.నాగేంద్ర మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2026–2027 విద్యా సంవత్సరం నుంచి సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్వహించిన ఈ స్కాలర్‌షిప్ పరీక్షలో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి 100% ఉచిత కోచింగ్, 4వ నుంచి 10వ స్థానం వరకు 50% ఫీజు రాయితీ, 11వ నుంచి 20వ స్థానం వరకు 25% ఫీజు రాయితీ అందించనున్నట్లు తెలిపారు. అలాగే మిగిలిన విద్యార్థులకు కూడా తక్కువ ఫీజుతో నాణ్యమైన కోచింగ్ అందించబడుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు పూర్తిగా ఉచిత కోచింగ్ అందించడం ద్వారా సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.


ఈ కోచింగ్‌లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల పర్యవేక్షణలో వీక్లీ టెస్టులు, వ్యక్తిగత కౌన్సెలింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, సెమినార్లు, వ్యాసరచన, వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత శ్లోకాల బోధన, క్రమశిక్షణ, నైతిక విలువలు, క్రీడలకు ప్రాధాన్యత వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు వివరించారు.
“చదువుతో పాటు సంస్కారం – విజయానికి బాట” అనే లక్ష్యంతో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడమే తమ సంకల్పమని నిర్వాహకులు పేర్కొన్నారు.


సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎస్.వి విద్యా మందిర్ హై స్కూల్, కొత్తపేట, రాయచోటి ప్రిన్సిపాల్‌ను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఆటలో గెలుపు ఓటములు సహజం…అమరేంద్ర,సెక్రటరీ అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్

Dr. Gangi Reddy Janam Chief Editor-

రెడ్డి సంక్షేమ సంఘం సేవాగుణం .. గిరిజన ముంగిట: తలకోన కు వస్త్రదానం మరియు అన్నవితరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ సీతారామ కళ్యాణాన్ని రంగ రంగ వైభవంగా జరిపించిన సర్పంచ్ ఎస్.స్వాతి బాలకృష్ణ రాజు దంపతులు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment