Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

సుమతీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వి స్టేజ్ క్రియాశీలక సభ్యులు 

సుమతీ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వి స్టేజ్ వెస్టీజ్ సభ్యులు

తిరుపతి, జూన్ 21(జానం న్యూస్): భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుమతీ రెడ్డిని తిరుపతిలోని ఆమె నివాసంలో వి స్టేజ్ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఆరోగ్య, వెల్‌నెస్ ఉత్పత్తులను ఆమెకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుమతీ రెడ్డి మాట్లాడుతూ, నేటి జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం మరింత పెరిగిందన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో నాణ్యమైన ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాగే, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న వెస్టీజ్ వంటి సంస్థల సేవలు ప్రశంసనీయమని అన్నారు.

వి స్టేజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సంస్థ అందిస్తున్న ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యాభివృద్ధితో పాటు ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా సంస్థ పలు కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వి స్టేజ్, సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి, సంస్థ సభ్యులు కిషోర్, భువనేశ్వర్ రెడ్డి, మల్లిక, కావేరి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

సమర్థతకు ఆవార్డుతో సత్కారం… హిందీ ఉపాధ్యాయుడు బి.ఎస్ రాంబాబు కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

Dr. Gangi Reddy Janam Chief Editor-

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుంది: మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

స్నేహితుల దినోత్సవం వేడుకల్లో వాయల్పాడు పీ.వి.సి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1980 టెన్త్ క్లాస్ బ్యాచ్

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment