రమేష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం పీలేరు పట్టణంలోని మార్కెట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఉపాధ్యాయులు పోతంశెట్టి రమేష్ పుట్టినరోజు: అన్న క్యాంటీన్‌లో పేదలకు అన్నదానం.
పీలేరు, జూన్ 26(జానం న్యూస్): ఉపాధ్యాయుడు పోతంశెట్టి రమేష్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం పీలేరు పట్టణంలోని మార్కెట్ ఆవరణలో ఉన్న అన్న క్యాంటీన్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
తన పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవాలన్న సంకల్పంతో పోతంశెట్టి రమేష్ సొంత ఖర్చులతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. వందలాది మంది పేదలు, యాచకులు, కూలీలు అన్న క్యాంటీన్‌కు చేరుకుని భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోతంశెట్టి రమేష్ మాట్లాడుతూ: “సమాజానికి విద్యతో పాటు సేవ కూడా అవసరం. పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసుకోవడం కాదు, నలుగురు పేదల ఆకలి తీర్చడం. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం పెట్టే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని తోటి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులు పోతంశెట్టి రమేష్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు, తోటి ఉపాధ్యాయులు, కూటమి నాయకులు అభినందించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి రహత్ భాష,శెట్టి సుబ్రహ్మణ్యం, వంగిమల్ల రామచంద్ర సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

