Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

మత్తు వదిలితేనే భవిష్యత్తు బంగారం: డాక్టర్ బత్తుల రాయుడు

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సఫర్డ్ సొసైటీ, ఏపీ వీహెచ్ఏ మరియు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి డాక్టర్ బత్తుల రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మత్తు వదిలితేనే భవిష్యత్తు బంగారం: డాక్టర్ బత్తుల రాయుడు

నంద్యాల,  జూన్ 25(జానం న్యూస్ ): 

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సఫర్డ్ సొసైటీ, ఏపీ వీహెచ్ఏ మరియు స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి డాక్టర్ బత్తుల రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మత్తుకు బానిస కావడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినడంతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా యువత చెడు స్నేహాలు, ఒత్తిడి, ఆందోళనల కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని చెప్పారు.

యువత మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అరుణ, లక్ష్మీదేవి, శివరామిరెడ్డి, బర్నబాసు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం

Dr. Gangi Reddy Janam Chief Editor-

అన్నమయ్య జిల్లా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందు ఉంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: అన్నమయ్య జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment