Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

జానం న్యూస్, పీలేరు, నవంబర్ 17:
ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యకులుగా పులి శ్రీనివాసులు ఎన్నికైన సందర్భంగా అన్నమయ్య జిల్లా, పీలేరు పట్టణం, బాస్ కార్యాలయంలో పీలేరు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పులి శ్రీనివాసులు, పులి మల్లీశ్వరి దంపతుల కు దుస్సాలవాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగమైన “పే బాక్ టు సొసైటీ” అనే నినాదంతో ముందుకు వెళుతూ గిరిజన యానాదుల జీవిత సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ అంబేడ్కర్ ఆశయాలను ఆచరిస్తూ తనకొచ్చిన సంపాదనలో ప్రతినెలా తన యానాది జాతి కోసం ఖర్చు చేస్తూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న పులి శ్రీనివాసులు భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అలంకరించి గిరిజన యానాది బ్రతుకులలో వెలుగులు నింపి అభినవ అంబేద్కర్ గా తన జీవితాన్ని తన జాతి కోసం కృషి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాలమహ నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణి కుమార్,భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో – కన్వీనర్ మరియు వి.సీ.కే పార్టీ జాయింట్ సెక్రెటరీ పాలకుంట శ్రీనివాసులు, గిరిజన రాష్ట్ర సమైక్య పీలేరు నియోజకవర్గ అధ్యక్షులు కిల్లా విజయ్ కుమార్,కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.ఎస్ కుమారచారి, పీలేరు మండల కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్, పీలేరు ముస్లిమ్ జే.ఏ.సి నాయకులు షేక్ అమీరుల్లా, దారుస్సలాం వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు షేక్ బోదెషా,బాస్ జిల్లా నాయకులు ముల్లంగి క్రిష్ణయ్య,మండల నాయకులు శివ కుమార్, మాలమహానాడు సీనియర్ నాయకులు రామాపురపు ద్వారక, మండల ప్రచార కార్యదర్శి దప్పేపల్లి అనంద్,కార్యవర్గ సభ్యులు గుండ్లురూ నాగేంద్ర బాబు,జాతీయ అంబేడ్కర్ సేవా సంఘం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ రెడ్డయ్య, జిల్లా వ్యవసాయ అధ్యక్షులు దప్పేపల్లి సురేంద్ర, ఇంకా అనేకమంది వివిధ ఎస్సీ/ఎస్టీ/బి.సి/మైనారిటీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

గిరిజన యానాది నాయకులు పులి శ్రీనివాసులు,పులి మల్లీశ్వరి దంపతుల సన్మాన సభలో మాట్లాడుతున్న మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణి కుమార్
Socal Share

Related posts

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

తహసిల్దార్ మహబూబ్ బాషా సేవలు మరువరానివి: పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మల్లెల, సీనియర్ పాత్రికేయులు జాకీర్ పఠాన్.

Dr. Gangi Reddy Janam Chief Editor-

గండబోయనపల్లిలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment