Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

మన సంస్కృతిని, సాంప్రదాయాలను మర్చిపోకూడదు: శ్రీ భువన విద్యాలయం పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి, ప్రిన్సిపల్ గుణ లక్ష్మి.

పీలేరు సెప్టెంబర్ 15 (జానం న్యూస్): నేటితరం పిల్లలు మన సంస్కృతిని సాంప్రదాయాలను మర్చిపోకూడదని పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి ప్రిన్సిపల్ గుణ లక్ష్మి అన్నారు.
శుక్రవారం పీలేరు-చిత్తూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ భువన విద్యాలయంలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మద్య జరిగాయి, ఈ సందర్భంగా వారు వినాయక చవితి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు వినాయక చవితి ప్రాముఖ్యతను నాటకాల ద్వారా ప్రదర్శించారు.విద్యార్ధులు గణపతి పాటలు ఆలపించారు. విద్యార్థులు ప్రదర్శించిన దేవతా వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పై కార్యక్రమంలో పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పీలేరు జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సభ – ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ కన్నీటి వీడ్కోలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా “హిందీ దివస్/జాతీయ హిందీ భాష దినోత్సవం” వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment