గండబోయనపల్లి గ్రామంలో ప్రతియేటా నిర్వహించబడే శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఈ ఏడాది మరిన్ని వైభవంతో, భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ సత్యమ్మతల్లి ఆలయంలో ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని దివ్యంగా ముస్తాబుచేయబడింది. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు అర్పించారు.
వాల్మీకిపురం, మే 26(జానం న్యూస్): గండబోయనపల్లి గ్రామంలో ప్రతియేటా నిర్వహించబడే శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర ఈ ఏడాది మరిన్ని వైభవంతో, భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ శివారులో స్వయంభుగా వెలసిన శ్రీ సత్యమ్మతల్లి ఆలయంలో ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని దివ్యంగా ముస్తాబుచేయబడింది. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు అర్పించారు.
అర్ధరాత్రి తరువాత భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి అభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ పద్దతిలో దీలు, బోనాలు సమర్పించడమే కాకుండా, కోలాటాలు, జానపద పాటలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి.

ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి(సత్యా రెడ్డి), ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం గండబోయనపల్లికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ దర్శనానంతర, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి గారి స్వగృహంలో భక్తులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి పాత్రికేయులతో మాట్లాడుతూ, “శ్రీ సత్యమ్మ తల్లి దీవెనలతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.

అలాగే ఆయన మాట్లాడుతూ, “ఆలయ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పులి సత్యనారాయణ రెడ్డి ఆలయ అభివృద్ధి, జాతర వేడుకల నిర్వహణలో విశేష కృషి చేశారు. ఆయన దృఢ సంకల్పంతో ఈ జాతర మరింత ప్రతిష్టితమైందని పులి సత్యనారాయణ రెడ్డిని ప్రశంసించారు,” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి( సత్యారెడ్డి), ఆలయ కమిటీ సభ్యులు, వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

