Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా “హిందీ దివస్/జాతీయ హిందీ భాష దినోత్సవం” వేడుకలు

పీలేరు, సెప్టెంబర్ 14(జానం న్యూస్): స్థానిక చిత్తూరు జాతీయ రహదారిలో ఉన్న శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ‘హిందీ దివస్,/జాతీయ హిందీ భాష దినోత్సవం’ వేడుకలు ఘనంగా జరిగాయి. పై కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి, ప్రిన్సిపాల్ గుణలక్ష్మి, హిందీ పండిట్స్ సమీర్ సుల్తానా, దుర్గా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీని దేశ అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా హిందీ దివస్ లేదా జాతీయ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.హిందీ భాష ప్రాముఖ్యతను తెలిపేందుకు మొదటి హిందీ దివస్ సెప్టెంబర్ 14, 1953న నిర్వహించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1977లో ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగం చేయడం గమనార్హం. భాష పట్ల ఆయన తన మద్దతును ఇలా తెలియజేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 43.6 శాతం మంది ప్రజలు హిందీ మాట్లాడతారని గుర్తించారు.  ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష హిందీ. విద్యార్థులు హిందీ భాషలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు హిందీ లో పాడి అలరించారు. పై కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ, రాఘవరెడ్డి, జయచంద్ర, శామ్యూల్, కృష్ణకుమారి, రమేష్, హరి, ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులు 500 మంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

మసీదులు, దర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి- జిల్లా waqf board ఛైర్మన్ SA కరీముల్లా.

Dr. Gangi Reddy Janam Chief Editor-

పైలట్ నుండి పవర్ ఫుల్ లీడర్, తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా ఎదిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి: మొర్రంరెడ్డి రామ్ కుమార్ రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment