Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

శ్రీ సాయి నారాయణ నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళం ₹50K అందజేసిన నందలూరి భాస్కర్ రెడ్డి

వాయల్పాడు, సెప్టెంబర్ 19(జానం న్యూస్); పీలేరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నందలూరి భాస్కర్ రెడ్డి , భాస్కర్ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ మరియు శ్రీ ఫంక్షన్ హాల్ అధినేత వాయల్పాడు శ్రీ సాయి నారాయణ సేవ (నిత్య అన్నదాన ) ట్రస్టుకు భవన నిర్మాణము కొరకు ₹50కే ట్రస్ట్ చైర్మన్ పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కి విరాళముగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా ట్రస్ట్ చైర్మన్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి  మాట్లాడుతూ నిరంతరం పేదలకు రోగులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కొరకు శాశ్వత భవన నిర్మాణానికి ఈ మొత్తాన్ని వాడుతామని తెలియజేశారు. దాతల సహకారముతో గత రెండు సంవత్సరాల 4 నెలలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ట్రస్టు సభ్యులు భాస్కర్ రెడ్డి ని అభినందించడం జరిగింది. పై కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు జామకాయల కృష్ణమూర్తి, వాల్మీకిపురం ఉప సర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి, సీనియర్ నాయకులు చింతల ఆనంద రెడ్డి, పీలేరు వైసీపీ యువ నాయకులు టి.గోవర్ధన్ రెడ్డి, ఎన్.ప్రసాదరెడ్డి, టి.రెడ్డప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పేదల ఆరాధ్య దైవం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి:పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం

Dr. Gangi Reddy Janam Chief Editor-

టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment