Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు మండల విద్యాశాఖ కార్యాలయంలో “మేరీ మట్టి మేరా దేశ్”కార్యక్రమం.

జానం న్యూస్, పీలేరు సెప్టెంబర్ 25: “మేరీ మట్టి మేరా దేశ్” కార్యక్రమంలో భాగంగా పీలేరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో  “మట్టి కా నమన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక అయ్యప్ప రెడ్డి కాలనీ, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ ఉన్నత ప్రధాన పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనా సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు కలశంలో మట్టిని సేకరించి దేశ నాయకుల చిత్రపటాలతో ‘మేరీ మట్టి మేరా దేశ్’ నినాదాలతో పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా మండల విద్యాశాఖ కార్యాలయం వరకు వచ్చారు. వారు సేకరించిన మట్టిని మండల విద్యాశాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు వై.లోకేశ్వర్ రెడ్డి, బి.పద్మావతి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో నిర్వహింప బడుతుందని అన్నారు.
మన రాజధాని అయిన ఢిల్లీ లో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ ఆవరణలో గల ఉద్యానవనంలో సేకరించిన మట్టిని వేయడం జరుగుతుందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ ముగింపు ఉత్సవాలు జరుపుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల నుండి సేకరించిన మట్టిని ఒక కలశంలో పొందుపరిచారు. అంతేకాకుండా విద్యార్థులందరి చేత “పంచ్ ప్రాన్” ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప రెడ్డి కాలనీ జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఫౌజియాబేగం, ఉపాధ్యాయులు జానం సుజాత, సంపూర్ణమ్మ(సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుని), స్వప్నలత, విజయ కుమారి, గంగయ్య,రామరాజు, ఉమామహేశ్వరి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.జి నటరాజ, ఉపాధ్యాయులు జనార్ధన్, రమణ, రాజన్న, గౌస్, నాగవేణి, కిషోర్, ముని రామయ్య, జడ్పీ ప్రధాన ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్ (సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు), మనోహర్, విద్యార్థినీ విద్యార్థులు, మండల విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గిరిజన యానాది నాయకుడు పులి శ్రీనివాసులు కు ఘన సన్మానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment