Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు

కలికిరి, జూన్ 10 (జానం న్యూస్): సేవాభావానికి ప్రతీకగా, మంచి మనసుకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ సామాజిక సేవకుడు, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం కలికిరిలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, సామాజిక కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కరించారు. సమాజ సేవ పట్ల అపారమైన అంకితభావంతో పేద, నిరుపేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తిగా పులి సత్యనారాయణ రెడ్డి సేవలను కొనియాడారు.

“అందరూ బాగుండాలి.. అందులో తాను కూడా ఉండాలి” అనే గొప్ప తత్వాన్ని ఆచరణలో చూపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సమర్థవంతమైన నాయకత్వం వహిస్తూ పేద వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.

oplus_18

అదేవిధంగా గండబోయనపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పరిరక్షణకు తనవంతు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ మీడియా ప్రతినిధులకు అండగా నిలుస్తున్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అభిప్రాయపడ్డారు.

వెస్టీజ్ సంస్థలో క్రియాశీలక సభ్యునిగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూనే, తన సేవాభావం, పట్టుదలతో అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.

శాలువాతో ఘన సత్కారం

ఈ సందర్భంగా రాయచోటికి చెందిన వినాయక కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ సంస్థ ప్రొప్రైటర్ కె. బాలకృష్ణారెడ్డి (బాబురెడ్డి) కలికిరి పట్టణంలోని ధరణి హోటల్ ఆవరణలో పులి సత్యనారాయణ రెడ్డిని శాలువా కప్పి, పూలహారం వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలకృష్ణారెడ్డి అభినందనలు

ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “పులి సత్యనారాయణ రెడ్డి సమాజ సేవకు అంకితభావంతో పనిచేస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పేదల సంక్షేమం, సామాజిక అభివృద్ధి, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమైనవి. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించి మరెన్నో సంవత్సరాలు సమాజ సేవలో కొనసాగించేలా దీవించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

శుభాకాంక్షల వెల్లువ

ఈ సందర్భంగా పలువురు అభిమానులు, మిత్రులు, సామాజిక కార్యకర్తలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పులి సత్యనారాయణ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని, మరింత ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ సేవలో విశేష కీర్తి సాధించాలని ఆకాంక్షించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీల బ్యాడ్మింటన్ విజేత టి.హోత్రిశ్రీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

సైనిక్ స్కూల్ & ఇన్‌స్పైర్ మనక్ అవార్డ్స్‌లో ఏ.వి.ఆర్ విద్యార్థుల సత్తా

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment