Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

‘నెహ్రు విద్యాలయ సమితి’ సౌత్ ఇండియా స్థాయి రన్నింగ్ రేస్ లో పీలేరు రేసు’గుర్రం సిద్ధార్థ’

పీలేరు, ఆగస్టు 18(జానం న్యూస్): తల్లిదండ్రులు ఎప్పుడు తమ కుమారులు వారి ఇంటి పేరును నిలబెట్టాలని కోరుకుంటారు. అలాంటిది ‘గుర్రం’ తన ఇంటిపేరు అయిన సిద్ధార్థ పీలేరు మండలం, దొడ్డిపల్లి పంచాయతీకి చెందిన గుర్రం నారాయణ ప్రథమ కుమారుడు. ప్రస్తుతం చిత్తూరు జవహర్ నవోదయా విద్యాలయం(ఈ పాఠశాల ప్రస్తుతం వలసపల్లి, మదనపల్లి వుంది)లో 11వ తరగతి ఎంపీసీ గ్రూపు చదువుతున్నాడు. నవోదయ విద్యాలయ సమితి  దక్షిణ భారత(ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్) స్థాయిలో ఇటీవల జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలలో పాల్గొని 100 మీటర్లు, 200 మీటర్లు రున్నింగ్ రేస్ లో ప్రథమ స్థానం సాధించాడు. ఆగస్టు నెల 24, 25, 26 తేదీలలో గుజరాత్ రాష్ట్రం నడియాడ్ లో జాతీయస్థాయిలో జరుగు పోటీలకు సిద్ధమవుతున్నాడు.ఈ సందర్భంగా గుర్రం సిద్ధార్థ మాట్లాడుతూ తాను ఇంతటి స్థాయిలో రాణిస్తున్నందుకు మొదటి కారకులు తన వ్యాయామ ఉపాధ్యాయులు జీ.సురేంద్ర రెడ్డి అని తెలిపారు.వ్యాయామ ఉపాధ్యాయులు జి.సురేంద్ర రెడ్డి శిక్షణలోనే తాను జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్రం సిద్ధార్థ పరుగు పందెంలో పాల్గొంటే పోటీదారులు వెనకాల అందనంత దూరంలో ఉంటారు. ఇలా తన ఇంటిపేరు “గుర్రం” అయినందుకు ‘రేసుగుర్రం’ లాగా దూసుకుపోతూ తన ఇంటి పేరుకు సార్థకత చేసినందుకు సిద్ధార్థ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు.గుర్రం సిద్ధార్థ తండ్రి గుర్రం నారాయణ గత 25 సంవత్సరాల నుండి దళిత ఉద్యమ నేతగా, సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.  తల్లి వనజాక్షి ప్రథమ చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

చిత్తూరులో ఘనంగా జాతీయ మామిడి దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరులో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం

Dr. Gangi Reddy Janam Chief Editor-

టెన్త్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన అగస్తీశ్వర్ దంపతులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment