Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఘనంగా డీసీఎంఎస్ చైర్మన్  సహదేవ రెడ్డి జన్మదిన వేడుకలు.

కలికిరి, నవంబర్ 15: స్థానిక పట్టణంలో  బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సహదేవ రెడ్డి జన్మదిన వేడుకలు కే.ఎస్ జక్కివుద్దీన్ ఆధ్వర్యంలో ఖతీబ్ గార్డెన్ నందు వైస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ కే.ఎస్ అఘామొహిద్దీన్ మనువడు మాస్టర్ ఉమైర్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేక్ అందరికీ తినిపించారు. ఈ సందర్భంగా పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వైస్సార్సీపీ స్టేట్ సెక్రటరీ కే.ఎస్ అఘామొహిద్దీన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ సహదేవ రెడ్డి చాలా మంచి మనసున్న మనిషి అని, వైయస్సార్సీపి పార్టీకి నియోజకవర్గంలో వెన్నెముకగా ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఆయనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని అన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు.పై కార్యక్రమంలో  కలికిరి మండల మహిళా ఉపాధక్షురాలు శ్రీమతి విజయరెడ్డి, పార్టీ సీనియర్ లీడర్ శివాజీ , కలికిరి యువ నాయకులు షైక్ హనీఫ్, గడి యువ నాయకులు జునైద్ అహమ్మద్, కే.ఎస్ జియావుద్దీన్, పల్లవోలు సచివాలయ కన్వీనర్ నూరు, బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

వైసీపీ ప్రభుత్వంలో పీలేరు మండలం అన్ని విధాలా అభివృద్ధి…

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు ఏ.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత  దినోత్సవం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా “హిందీ దివస్/జాతీయ హిందీ భాష దినోత్సవం” వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment