Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుంది: మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి

జానం న్యూస్, పీలేరు, నవంబర్ 20:చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం మీ జీవితాన్ని మారుస్తుందని మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి అన్నారు.నవంబర్ 14వ తేదీ నుండి జరిగిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం సోమవారం స్థానిక గ్రంథాలయ కార్యాలయంలో జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనానికి ఉన్నంత ప్రాధాన్యత మరేదేనికి లేదంటారు. అలాంటి పుస్తక పఠనానికి మార్గం సుగమం చేసేవి గ్రంథాలయాలు. వీటిని విజ్ఞాన కేంద్రాలుగా కూడా పిలుస్తుంటారని ప్రతి పోటీ పరీక్షకు తర్ఫీదు అయ్యేదానికి  గ్రంథాలయంలో తగిన పుస్తకాలు లభ్యం అవుతాయని అన్నారు.

జిల్లా పరిషత్ మెయిన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాచపల్లి సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిలే దేశ సంపదని విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంచే భండాగారాలు గ్రంథాలయాలు.. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలాయాలు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు జగాలని ఆకాంక్షించారు.

ప్రెస్ క్లబ్ ప్రత్యేక ఆహ్వానితులు పటాన్ జాకీర్, అధ్యక్షులు మల్లెల జాకీర్, ప్రధాన కార్యదర్శి జలకనూరి చంద్రశేఖర రాజు మాట్లాడుతూ గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు గ్రంథాలయంలో సభ్యత్వం నమోదు చేపిస్తామని అన్నారు. జడ్పీ ప్రధాన ఉన్నత పాఠశాల(మెయిన్) తెలుగు పండితులు పి.భాస్కర్, వి.నరసింహులు పద్య, కవిత, గీతాలు ఆలపించి సబికులను అలరింపజేశారు.

పీలేరు గ్రంథాలయ అధికారి అమర్నాథ్ మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనాలు, రచయితల సందేశాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే సీనియర్స్‌, జూనియర్స్ రెండు  విభాగంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్రిజ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను తనకు తెలియజేస్తే వాటిని తెప్పిస్తానని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు నైనార్ మధుబాల లక్ష, ఎనబై విలువగల పోటీ పరీక్షల పుస్తకాలు కొనుగోలు చేశారని అవి ప్రస్తుతం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(మెయిన్) ఆంగ్ల ఉపాధ్యాయులు ప్యారూఖాన్ మాట్లాడుతూ పీలేరు గ్రంథాలయంలో సభ్యత్వం చేసుకోలేని పేద విద్యార్థులు తనను సంప్రదిస్తే సభ్యత్వ రుసుము తాను చెల్లిస్తానని అన్నారు.. అనంతరం పోటీలలో పాల్గొన్న విజేత విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు శాలువా కప్పి, జ్ఞాపక బహుకరించి సత్కారించారు.

ఇంకా పై కార్యక్రమంలో ఆక్ ది బెస్ట్ ఖాదర్ బాషా, తెలుగు భాషా అధ్యక్షులు మురళీధర్ రాజు, పుస్తక నిక్షిప్త గ్రంథాలయ అధికారిని పి.మంజుల, స్వీపర్ ఎస్.పాటిమాబి,జడ్పీ ఉన్నత పాఠశాల(మెయిన్) విద్యార్థులు పాల్గొన్నారు.

Socal Share

Related posts

గండబోయనపల్లిలో ఆధ్యాత్మిక శోభతో వైభవంగా శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు హెరిటేజ్ ఫుడ్స్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు111 మంది మహిళా పాల సేకరణ ప్రతినిధులకు సన్మానం – మహిళా సాధికారతకు హెరిటేజ్ కట్టుబాటు

Dr. Gangi Reddy Janam Chief Editor-

అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment