Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

జానం న్యూస్, కెవి పల్లి, అక్టోబర్ 24:

శ్రీ వెన్నెల కంటి రాఘవయ్య గిరిజన యానాది ఆశయ సాధన సమితి అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సోమవారం అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గ, కె.వి పల్లి మండలం, కంబిరెడ్డి గారి పల్లి ఎస్టీ కాలనీలో గిరిజన యానాదుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం 30 మంది సభ్యులతో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా పులి శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్తగా జానం గంగిరెడ్డి, సలహాదారులుగా తుపాకుల హరిప్రసాద్, చౌటురి కృష్ణమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాసులు, కన్వీనర్ గా మద్దాలి ఇశ్రాయేలు, యూత్ అధ్యక్షులుగా చుక్కలపాటి ఆదినారాయణ, ముఖ్య కార్యదర్శిగా ఏలూరి శ్రీనివాసులు, కోశాధికారిగా టేకుమంద రెడ్డప్ప, ఉపాధ్యక్షులుగా కంబాల ఈశ్వరయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేవూరి పద్మ, మహిళా కార్య నిర్వాహక అధ్యక్షురాలుగా బాదురి సావిత్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు ఆశయ సాధన కోసం కృషి చేస్తూ, గిరిజన యానాదులను ఏక త్రాటిపై తెస్తూ గిరిజన యానాదుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.త్వరలో గ్రామస్థాయి నుండి సంఘం బలోపేతం చేసి జిల్లా కమిటీలు కూడా వేయడం జరుగుతుందని అన్నారు.పై కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి గిరిజన యానాది నాయకులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఉదయ భాస్కర్

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు పట్టణంలో ఉద్యమంగా సాగిన “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

మదనపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment