Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు లో ఏర్పాటు చేసే టపాసులు దుకాణాల స్థలాన్ని  పరిశీలించిన అధికారులు

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 27: పీలేరు పట్టణంలో టపాసులు విక్రయ దుకాణాలను ఏర్పాటు చేస్తున్న స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణం, బొడుమల్లువారిపల్లి సమీపంలోని  జాతీయ రహదారి ప్రక్కన స్థలాన్ని రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక దళం, విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా తహాసిల్దార్ కే.ధనుంజయులు మాట్లాడుతూ పీలేరు పట్టణంలో టపాకాయల విక్రయానికి 16 దుకాణాలకు అనుమతి ఇచ్చామని అన్నారు.స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో 14 దుకాణాలకు,  బొడుమల్లువారిపల్లి సమీపంలోని జాతీయ రహదారి ప్రక్కన 2 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. టపాసులు దుకాణా దారులతో మాట్లాడుతూ _టపాసులు వ్యాపారస్తులు దుకాణానికి దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలని, దుకాణాలన్నీ ‘ఎల్’ ఆకారములో ఉండాలని, అగ్నిమాపక, విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని జాగ్రత్తలకు కచ్చితంగా పాటించి దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు.పీలేరు అగ్నిమాపక దళ అధికారి షేక్ మస్తాన్ మాట్లాడుతూ _ప్రతి దుకాణ యజమాని ముందస్తు జాగ్రత్తగా 200 లీటర్ల సామర్థ్యం గల రెండు డ్రమ్ములు, ఇసుక 10 బకెట్లు, 2 ఫైర్ ఎక్స్టింగ్ గిషర్లు తయారుగా ఉంచుకోవాలని అన్నారు. విద్యుత్ వైర్లు దుకాణానికి పై భాగంలో వచ్చేలా చూడాలని, టపాసులు కొనుగోలుదారులకు వాహన పార్కింగ్ స్థలము దుకాణాలకు దూరంగా ఏర్పాటు చేయాలని అన్నారు._ పై కార్యక్రమంలో పీలేరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ పురుషోత్తం, రాజంపేట ఎంపీ పి.ఆర్.ఓ ఉదయ్ కుమార్, కాగితి ఆనంద్, బుక్ షాప్ సంజీవయ్య, వి.ఆర్.ఓ లు సి.యర్రయ్య,డి.వెంకటరమణ,శిల్ప,కవిత,సర్వేయర్ రెడ్డెప్ప,పిసి కే.విజయకుమార్,టపాసుల దుకాణాల విక్రయ దారులు తదితరులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి  ఎం.ఆనంద రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Prime Minister Narendra Modi launched “Mera Yuva Bharat Sangathan”.

Dr. Gangi Reddy Janam Chief Editor-

టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment