Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర వైభవోపేతంగా ముగింపు – ధన్యవాదాలు తెలుపిన ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి

వాల్మీకిపురం మండలానికి చెందిన గండబోయినపల్లిలో ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర మే 25, 26 తేదీలలో (ఆదివారం, సోమవారం) భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరగింది. ఈ రెండు రోజుల పాటు జరిగిన జాతరలో జిల్లాతో పాటు సమీప ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ఆమె కటాక్షాన్ని పొందారు.

 

వాల్మీకిపురం మే 27(జానం న్యూస్):వాల్మీకిపురం మండలానికి చెందిన గండబోయినపల్లిలో ఘనంగా నిర్వహించిన శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర మే 25, 26 తేదీలలో (ఆదివారం, సోమవారం) భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరగింది. ఈ రెండు రోజుల పాటు జరిగిన జాతరలో జిల్లాతో పాటు సమీప ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ఆమె కటాక్షాన్ని పొందారు.

జాతర విజయవంతంగా ముగియడంతో ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి (సత్యా రెడ్డి) ఓ ప్రకటనలో మాట్లాడుతూ—
“ఈ పుణ్యకార్యాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, వారి సేవలకు మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, గ్రామస్థులు, భక్తులు, ప్రభుత్వాధికారులు, కళాకారులు, దాతలు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది – అందరి సహకారం మాకు విలువైనదై జాతర విజయానికి నాంది పలికింది,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కడప మినీ మహానాడు ఏర్పాట్లతో బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం పట్ల ధర్మకర్త గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జాతర అనంతరం మంగళవారం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ—
“ప్రతి ఒక్కరి సహకారంతో ఈ జాతర అత్యంత సాఫల్యంగా జరిగింది. మీ అందరి సహాయం మాకు మన్నించదగినదిగా, మరింత ఉత్సాహాన్నిచ్చింది. శ్రీ సత్యమ్మ తల్లి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం,” అని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి (సత్యా రెడ్డి), కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, చక్రపాణి, అమర్నాథ్ రెడ్డి, ఎన్.సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, ఓబుల్ రెడ్డి, రమేష్ బాబు, శేఖర్, హరి, తదితర గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

వేడుకగా బ్రాహ్మణ సేవా సంఘ కార్తీక వన మహోత్సవం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు ప్రారంభం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ సాయి నారాయణ నిత్య అన్నదాన ట్రస్ట్ కు విరాళం ₹50K అందజేసిన నందలూరి భాస్కర్ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment