Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 14: స్థానిక చిత్తూరు రహదారి పై ఉన్న శ్రీ భువన విద్యాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు దేవతల వేషధారణలో దసరా పండుగ ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా ప్రదర్శించారు. దుర్గామాత మహిషాసుర రాక్షసున్ని సంహరించే ఘట్టం అందర్నీ అలరించింది. ముఖ్యంగా దుర్గామాత, మహిషాసుర రాక్షస వేషం అందరిని ఆకర్షించింది. ఈ సందర్భంగా శ్రీ భువన విద్యాలయ కరస్పాండెంట్ ఉమా రమాదేవి, ప్రిన్సిపాల్ గుణలక్ష్మీ మాట్లాడుతూ విజయ దశమి ‘దసర’ చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ ‘విజయదశమి’ అని అన్నారు. విద్యార్థులు కూడా చెడును విస్మరించి మంచి వైపు పయనించి అందరి మన్ననలు పొంది బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  తల్లిదండ్రులు, ఫ్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్  విద్యార్థులు13కే మంది పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

మెగా పీటీఎం–4.0 విజయవంతం.. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల చేయూత

Dr. Gangi Reddy Janam Chief Editor-

Students should grow as scientists: Piler MEOs are Lokeshwar Reddy and Padmavathi.

Dr. Gangi Reddy Janam Chief Editor-

టెన్త్ విద్యార్థుల్లో ఉత్సాహం నింపిన అగస్తీశ్వర్ దంపతులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment