జానం న్యూస్, పీలేరు, సెప్టెంబర్ 25: పీలేరు గణేష్ ఉత్సవాలు టీటీడీ టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారం అయినట్లు పీలేరు మాజీ శాసనసభ్యులు జివి శ్రీనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ తర్వాత అతి వైభవంగా జరిగేది పీలేరు పట్టణంలోనే అని అన్నారు. సర్పంచ్ డాక్టర్ షేక్ హబిబ్ భాషా మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం పీలేరు పట్టణంలో అతి వైభవంగా జరుగుతుండడంతో పై వేడుకలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైందని అన్నారు. ఇక ప్రతి ఏడాది రాష్ట్రంలోని కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని, ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అందిస్తామని అన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వారణాసి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఊరేగింపు తెల్లవారి 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు జరిగి అనంతరం అయ్యప్ప నాయినిచెరువులో నిమజ్జనం జరుగుతుందని అన్నారు. అయినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా గత 38 సంవత్సరాలుగా ప్రతి ఏడాది జరుగుతుందని అన్నారు. అందుకు సహకరించిన పోలీసు, విద్యుత్, పంచాయతీ అధికారులకు విగ్రహ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేశ ఉత్సవం వేడుకలు సిడి ని, కరపత్రాలను ఆవిష్కరించారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కాకులారం భాస్కర్ రెడ్డి, వారణాసి మోహన్ రెడ్డి, జ్ఞానం గారి శ్రీధర్, బిజెపి రమణ, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ పురుషోత్తం, ప్రముఖ కళాకారిణి పాలగిరి హరిత, కండక్టర్ ప్రమీల తదితరులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ప్రముఖ కళాకారిణి పాలగిరి హరిత చేసిన భరతనాట్యం అందరిని అలరించింది. పై కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎన్ వి చలపతి, షి సంస్థ నిర్వాహకులు డాక్టర్ పి.వీ.ఎస్ లక్ష్మి సుధాకర్, వార్డు సభ్యులు విక్టరీ వెంకట రమణారెడ్డి, ఆబీద్, ఏ.ఎస్ హబిబ్, మల్లికార్జున రెడ్డి (విశ్రాంతి ఉపాధ్యాయులు), వైసీపీ నాయకులు డివి రమణ అలియాస్ పెద్దోడు, మునీర్, స్టాంపుల నర్సింహారెడ్డి, మల్లెల శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ ఈవో ప్రసాద్ రెడ్డి, పట్టణంలోని సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్మికులు, పాల్గొన్నారు.









