కె.వి.పల్లి, మార్చి 11(జానం న్యూస్ ):
అన్నమయ్య జిల్లాలోని కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి గ్రామంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (బాలురు)లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి పి. సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల జిల్లా కన్వీనర్ మరియు APRS CAT & APRJC–DC CET–2026 పరీక్షల సమన్వయకర్త డాక్టర్ ఎం. రామకృష్ణాంజనేయులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఈ ప్రవేశాలలో 5వ తరగతిలోని అన్ని సీట్లకు, అలాగే 6వ, 7వ, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో MPC (60), BIPC (40), MEC (30) గ్రూపుల్లో కూడా ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ http://aprs.apcfss.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 24, 2026న APRS CAT మరియు APRJC ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.
ఈ గురుకుల విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమంలో ఉత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందించబడుతుంది. విద్యార్థులకు పౌష్టికాహారం, వసతి తదితర సదుపాయాలు పూర్తిగా ఉచితంగా కల్పించబడతాయని అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలకు 8712625051, 8712625076 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అదనంగా, పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు APRJCలో ప్రవేశాలకు, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు APR డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు
Save or share this story as a newspaper-style Epaper Clip:

