Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఆత్మవిశ్వాసం పెంపొందించేవి క్రీడలేజిల్లా యువ అధికారి  ప్రదీప్ కుమార్

Lతిరుపతి, ఫిబ్రవరి 22(జానం న్యూస్): తిరుపతి  జిల్లా స్తాయిలో యూత్ హాస్టల్ గ్రౌండ్ లో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (మై భారత్ – చిత్తూరు)ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పురుషుల వాలీ బాల్ పోటీలు నిర్వహించారు.

ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథి గా సెట్వెన్ సి ఇ ఓ డా. యశ్వంత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే నిరంతరం క్రీడల్లో పాల్గొనడం ఎంతో అవసరమని తెలిపారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, మాటలలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

మై భారత్ ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని, మై భారత్ కమిటి మెంబర్ డా సోమ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలను తమ జీవితంలో ఒక భాగంగా మలచుకోవాలని సూచించారు.

గణాంకాధికారి ఎం సి బాబు రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోటీలలో పురుషుల వాలీబాల్‌కు 16జట్లు పాల్గొనడం విశేషామన్నారు.మాస్ అధ్యక్షులు కె జ్ఞానశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువత అందరూ స్వచ్ఛందంగా మై భారత్ కార్యక్రమాలలో పాల్గొని, కేంద్ర ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పురుషుల వాలీబాల్ మొదటి బహుమతి ఎస్వీ యూనివర్సిటీ టీం  కు : ₹6,000

రెండో బహుమతి బాలాజీ వాలీబాల్ టీం కు ₹4,000 నగదు బహుమతులు అందుకున్నారు

ఈ కార్యక్రమంలో మాస్ అధ్యక్షులు కె.ఙ్ఞాన శేఖర్ రెడ్డి, నాయక్ , అరుణ, జూలియన్ రాజు, మరియు స్టేడియం సిబ్బంది, మై భారత్ కేంద్ర సిబ్బంది  వాలంటీర్ లు  జిల్లా యువత పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రతి విద్యార్థి లోని కళల ను వెలికి తీయడంతోపాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: పి.బి శోభ ప్రకాష్, ప్రిన్సిపల్ ఏవిఆర్ స్కూల్,పీలేరు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

జనసేన నాయకులు అరెస్ట్

Jaanam News

Leave a Comment