Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కలికిరి పట్టణం లో నూతన ధరణి హోటల్ ను ప్రారంభించిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

జానం న్యూస్, (కలికిరి), ఆగస్టు 8:
అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఆర్చ్ ఎదురుగా రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ధరణి హోటల్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించారు. ప్రారంభోత్సవం ఘనంగా మరియు పండుగ వాతావరణం లో జరిగింది.

ధరణి హోటల్ యజమాని పులి సత్యనారాయణ రెడ్డి తన సతీమణి మరియు వారి కుమారుడు పులి ధరణి కుమార్ రెడ్డి తో కలిసి హోటల్‌కు వచ్చిన అతిథులకు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పులి సత్యనారాయణరెడ్డికి వ్యాపార దృక్పథం మాత్రమే కాకుండా సామాజిక సేవ దృక్పథం ఉందని, ఆయన పరోపకార మనస్తత్వాన్ని కొనియాడారు.

పులి సత్యనారాయణ రెడ్డి “అందరూ బాగుండాలి- అందులో నేను ఉండాలి” అనే మనస్తత్వం కలవాడని,తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుకుంటాడని ప్రశంసించారు. ధరణి హోటల్ అసాధారణమైన ప్రమాణాలతో రెండు దశాబ్దాల కాలంగా వినియోగదారులకు సేవలందిస్తోందని, రుచికి, శుచికి, మరియు నాణ్యతకు ధరణి హోటల్‌కు అత్యుత్తమ ఖ్యాతి ఉందని ప్రశంసించారు. హోటల్ మరింత అభివృద్ధి చెంది భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు.

భవిష్యత్తులో ధరణి హోటల్ ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సత్యనారాయణ రెడ్డి ‘రెడ్డి సంక్షేమ సంఘం’ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక సాంఘిక సేవలు చేశారని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ధరణి హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 11వ తేదీ వస్తారని పులి సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కంభం నిరంజన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నల్లారి లక్ష్మీకర్‌రెడ్డి, మాజీ ఎం.పీ.పీ నల్లారి చంద్రకుమార్‌రెడ్డి, “రెడ్డి సంక్షేమ సంఘం” నాయకులు పెద్ద ఎత్తున హాజరైయ్యారు.వారు పులి సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

నూతన ధరణి హోటల్ ను ప్రారంభిస్తున్న పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న ధరణి హోటల్ యజమాని మరియు రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి
Socal Share

Related posts

సంబేపల్లి, జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సభ.

Dr. Gangi Reddy Janam Chief Editor-

గండబోయినపల్లిలో ఆనందోత్సవాల మధ్య నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

వాయల్పాడు నుంచి గ్లోబల్ వేదికకు: క్రికెట్ విశ్లేషణలో శేషాద్రి సంపత్ అసాధారణ ప్రస్థానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment