Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

పీలేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభం.

స్థానిక చిత్తూరు జాతీయ రహదారిపై ఉన్న శ్రీ భువన విద్యాలయం నందు పీలేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభమైంది. శ్రీ భువన విద్యాలయం ప్రిన్సిపాల్ గుణ లక్ష్మి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.

జానం న్యూస్, పీలేరు, ఏప్రిల్ 6: స్థానిక చిత్తూరు జాతీయ రహదారిపై ఉన్న శ్రీ భువన విద్యాలయం నందు పీలేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభమైంది. శ్రీ భువన విద్యాలయం ప్రిన్సిపాల్ గుణ లక్ష్మి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తమ పాటశాల ఆవరణం లో క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నాగరాజ, శ్రీధర్, లాలా మాట్లాడుతూ పీలేరు నందు ప్రొఫెషనల్ కోచ్ లతో, అత్యుత్తమ సౌకర్యాలతో, క్రికెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పీలేరు ప్రాంత క్రీడా కారులను రాష్ట్ర, జాతీయ స్థాయి లో పాల్గొనేలా తర్ఫీదు ఇవ్వడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఈ క్యాంప్ ఉదయం 6.30 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు జరుగుతుందని తెలిపారు. తమకు శ్రీ భువన విద్యాలయం మైదానాన్ని అందించిన విద్యాలయం చైర్మన్ ఉమా రమాదేవి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భరత్, షాహెద్, బాను మరియు పీడీ లు చంద్రమౌళి, కిషోర్,నరేష్, నరేంద్ర, ప్రదీప్, క్రీడాకారులు పాల్గొన్నారు. కోచింగ్ రిజిస్ట్రేషన్ తదితర వివరాల కొరకు 7670933499 సంప్రదించాలని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

“ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం”పై అవగాహన కార్యక్రమం – పీలేరు లో జనసాక్షరతకు తొలి అడుగు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రజల ఆరోగ్యమే మహా భాగ్యం:కుప్పం రవిచంద్రా రెడ్డి,నందీస్ ఆక్వా వాటర్ ప్లాంట్ యజమాని.

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యార్థులు బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలి: పీలేరు మండల విద్యాశాఖాధికారి లోకేశ్వర్ రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment