Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్విద్య/ఉద్యోగాలు

సంబేపల్లి, జడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సభ.

మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నందు ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి యు.శివ ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం సంబేపల్లి, జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

జానం న్యూస్, సంబేపల్లి, ఫిబ్రవరి 22: మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నందు ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి యు.శివ ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం సంబేపల్లి, జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమైన భావనలపై, పట్టికలపై, పటాలపై వారికి తర్ఫీదు ఇవ్వడం ద్వారా వారిని కూడా ఉత్తీర్ణులను చేయవచ్చన్నారు.పదవ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండే జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి కృషి, పట్టదలతో బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్ర, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, ఎంఈఓ శ్రీనివాసులు, సాయి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బుజ్జి రెడ్డి, వైసిపి నాయకులు ప్రతాపరెడ్డి, ప్రముఖ లాయర్ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా విద్యాధికారి యు.శివప్రకాష్ రెడ్డి ని సన్మానిస్తున్న సంబేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సిబ్బంది.
Socal Share

Related posts

Ruby Jubilee Celebrations at APRS Gyarampalli.

Dr. Gangi Reddy Janam Chief Editor-

పాత బంధాలకు కొత్త ఊపిరి – వాల్మీకిపురం 1980 10th బ్యాచ్ మళ్ళీ కలుస్తోంది!

Dr. Gangi Reddy Janam Chief Editor-

రెడ్డి సంక్షేమ సంఘం సేవాగుణం .. గిరిజన ముంగిట: తలకోన కు వస్త్రదానం మరియు అన్నవితరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment