Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

దూదేకుల ముస్లిం లకు రాజకీయ అవకాశం కల్పించండి:-రాష్ట్ర “నూర్ బాష ” యూత్ ప్రధాన కార్యదర్శి ఫజులుల్లా

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 15: ముస్లింలలో అంతర్భాగ మైనటువంటి “నూర్ బాష” దూదేకుల ముస్లిం లకు చట్టసభల్లో రాజకీయంగా అవకాశం కల్పించాలని రాష్ట్ర “నూర్ బాష ” యూత్ ప్రధాన కార్యదర్శి ఫజులుల్లా అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

శుక్రవారం స్థానిక ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 20లక్షల జనాభా ఉన్నటువంటి “నూర్ బాష” కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు లేనందువల్ల తమ సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. “నూర్ భాష” దూదేకుల సంఘం తరఫున తమ డిమాండ్లు నెరవేర్చాలని ఎన్నో సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నా రాజకీయ పార్టీలలో చలనం లేదని అన్నారు.రాజకీయ పార్టీలు “నూర్ భాష” దూదేకులను ఓటు బ్యాంకింగ్ వాడుకొంటూ కాలం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

2024 ఎన్నికల్లో అధికారపక్షం, ప్రతి పక్ష పార్టీల్లో కచ్చితంగా తమ సామాజికవర్గానికి న్యాయంచేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో 10వేల జనాభా ఉన్న ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు.గెలవక పోయినా ఓడించేసత్తా “నూర్ భాషా” దూదేకుల వర్గానికి ఉందని ఉందని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

మదనపల్లిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

జేఎన్‌టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Skyline English Daily: Bridging the Gap between People and Government

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment