Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

షార్జాలో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్న డాక్టర్ యోగేష్ బాబు.

జానం న్యూస్, పిలేరు, నవంబర్ 23:పీలేరుకు చెందిన డాక్టర్ టి.యోగేష్ బాబు యూఏఈలో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్నారు. గురువారం ఆయన పీలేరులో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ.అర్.యు,  యుఎస్ఏ, ఈ.ఆర్.సి, ఇండియాలో పోస్టు డాక్టరల్ ఫెలోగా తన రీసెర్చిని కొనసాగిస్తున్నా అన్నారు. ఈ నెల 19, 20వ తేదీల్లో షార్జాలో జరిగిన యుఏఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో టి.యోగేష్ బాబు బెస్ట్ డైనమిక్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో “ఇండో మిడిల్ ఈస్ట్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు”ను అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన గెస్ట్ స్పీకర్ గా ప్రసంగించడంమే కాకుండా “ఇంపాక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ సిమోటిక్స్ ఆన్ ప్రొడక్ట్స్ ఇన్ ఏపి రీజియన్ ఇండియా” అనే రీసెర్చ్ ఆర్టికల్ ప్రజెంట్ చేసారు.ఎడ్యుకేషనల్ ఎక్సలెన్సీ పురస్కారం అందుకున్న సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పట్టణ ప్రముఖులు యోగేష్ బాబును అభినందించారు.

పురస్కారం అందుకున్న పీలేరు పట్టణానికి చెందిన డాక్టర్ యోగేష్ బాబు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

కంభిరెడ్డిగారి పల్లి ఎస్టీ కాలనీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

మిత్రుల సమక్షంలో ఘనంగా కర్రే రఘురాం జన్మదిన వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

బీఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో గుమ్మడం గ్రామంలో ఉచిత ఆర్‌ఓ తాగునీటి ప్లాంట్ ప్రారంభం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment