పవన్ కళ్యాణ్ దార్శనికతకు నిదర్శనం జనసేన నిర్మాణ సారథుల ప్రక్రియ: మైఫోర్స్ మహేష్
మదనపల్లి, జూలై 4(జానం న్యూస్):
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అబ్జర్వర్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే)కు రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్ పదవికి జనసేన నాయకుడు మైఫోర్స్ మహేష్ దరఖాస్తు సమర్పించారు.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో కేకేను కలిసి మహేష్ తన దరఖాస్తును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో కార్యకర్తలకు తమకు నచ్చిన పార్టీ పదవుల కోసం నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించిన తొలి పార్టీ జనసేనేనని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ, మండల, పంచాయతీ స్థాయిల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తమ ఆసక్తి మేరకు బాధ్యతలు కోరుకునేలా ఈ ప్రక్రియను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’ భావనతో ప్రతి కార్యకర్తకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించడమే జనసేన లక్ష్యమని తెలిపారు. ఆదివారం వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనున్నందున ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనను బలోపేతం చేయడం అంటే రాష్ట్రం, దేశాభివృద్ధికి తోడ్పడటమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, నాయకుడు కోసూరి వెంకట్ కిరణ్, వీర మహిళలు శోభ, సునీత, నాయకులు సందీప్ రెడ్డి, గంగాధర్, పవన్, చిరంజీవి, జాబీర్, వసీం, నగీన, అలాగే తంబళ్లపల్లి నియోజకవర్గ నాయకులు సద్దికూటి హరినాథ్, రాజారెడ్డి, సురేష్ రెడ్డి, మోహన్, సయ్యద్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

