Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ ఇవ్వాలని పీలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేత

జానం న్యూస్, పీలేరు, నవంబర్ 4: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిశ పిఎస్ ఉత్తర్వులు మేరకు ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్ట్ పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించాలని శనివారం ఉదయం పీలేరు మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి కి పీలేరు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లెల జాకీర్ హుస్సేన్, జలకనూరి చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ జర్నలిస్టులకు సేవ తప్ప ఆదాయం లేదని అది దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టు పిల్లలకు100% ఫీజు రాయితీ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. కాబట్టి జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని అన్నారు. గత జూలై నెలలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వులు దారి చేసినప్పటికీ ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. అందుకు మండల విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందిస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేస్తామని, అమలు చేయని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పై కార్యక్రమంలో పీలేరు ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు పఠాన్ జాకీర్, ఉపాధ్యక్షులు జానం గంగిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి రవి కిషోర్, సంయుక్త కార్యదర్శి తులసి కృష్ణ, రవి నాయక్,హఫీజ్, గోపి, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి,కోశాధికారులు సాక్షి రమణారెడ్డి, టీవీ9 సుబ్రహ్మణ్యం, ఆల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి కి వినతి పత్రం అందిస్తున్న పీలేరు ప్రెస్ క్లబ్ సభ్యులు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

జేఎన్‌టీయూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలి –JNTUA వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఘనంగా పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు ప్రారంభం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment