Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు

జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 2: అన్నమయ్య జిల్లా, పీలేరు సిఎల్ఆర్సి కార్యాలయ సమావేశ భవనంలో గురువారం పీలేరు ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. అధ్యక్షులుగా మల్లెల జాకీర్ హుస్సేన్, ఉపాధ్యక్షులుగా రామాంజులు, నాగరాజు, జానం గంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జలకనూరి చంద్రశేఖర్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవి కిషోర్, కోశాధికారిగా గండికోట వెంకటేష్, జాయింట్ సెక్రటరీలుగా రామచంద్ర, తులసి కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులుగా పటాన్ జాకీర్, గౌరవాధ్యక్షులుగా ఎస్. ఖాదర్ బాషా, గౌరవ సలహాదారుగా జమీల గౌస్, న్యాయ సలహాదారుగా హారీష్ అలీ, పదిమంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను సమన్వయపరుస్తూ సమిష్టిగా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ముఖ్యంగా అర్హులైన సభ్యులకు ప్రభుత్వ ఇండ్లు, ఇళ్ల పట్టాలు ఇప్పించుట, వారి పిల్లల చదువులకు ప్రైవేట్ పాఠశాలల్లో రాయితీ కల్పించుట ఇతర సమస్యలపై పోరాడుతామని అన్నారు. పై ఎన్నికలు సీనియర్ జర్నలిస్టు పటాన్ జాకీర్, అల్తాఫ్ హుస్సేన్ పర్యవేక్షణలో జరిగాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

46 ఏళ్ల స్నేహబంధానికి ఆత్మీయ వేడుక

Dr. Gangi Reddy Janam Chief Editor-

Prime Minister Narendra Modi launched “Mera Yuva Bharat Sangathan”.

Dr. Gangi Reddy Janam Chief Editor-

మన సంస్కృతిని, సాంప్రదాయాలను మర్చిపోకూడదు: శ్రీ భువన విద్యాలయం పాఠశాల కరస్పాండెంట్ ఉమా రమాదేవి, ప్రిన్సిపల్ గుణ లక్ష్మి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment