Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పాఠశాల సిబ్బంది ఇన్ టైంలో పాఠశాలకు చేరుకొని అటెండెన్స్ యాప్ లో నమోదు చెయ్యాలి: తిరుపతి డివిజన్ ఉప విద్యాశాఖాధికారి  ఎం.ఆనంద రెడ్డి.

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 7: శనివారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి (బాలికలు) పాఠశాలను తిరుపతి డివిజన్ ఉప విద్యాధికారి ఎం.ఆనంద రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.అటెండెన్స్ యాప్ ను పరిశీలించారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు ఇన్ టైంలో పాఠశాలకు వచ్చి అటెండెన్స్ యాప్ లో నమోదు చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు ఒక నెలలో మూడు రోజులకు మించి ఉపాధ్యాయులు ఇన్ టైంలో రాకపోయినా ఎడల అది సెలవు గా పరిగణిస్తామని అన్నారు. నోటుబుక్కులు, వర్క్ బుక్కులను ఉపాధ్యాయులు కరెక్షన్ చేస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. బైజుస్ ట్యాబులను ప్రతిరోజు ఉపాధ్యాయులు పాఠశాలకు తీసుకురావాలని అందుకు మినహాయింపు లేదని అన్నారు. ఇటీవల జరిగిన ఎఫ్.ఏ-2 పరీక్షలో టాపర్స్ అయినా 9వ తరగతి విద్యార్థినిలు యోషిత, రుషిత, పల్లవి లతో సెల్ఫీ తీసుకున్నారు.


జడ్పీ ఉన్నత పాఠశాల, కోటపల్లి (బాలికలు) సమీక్ష సమావేశంలో పాఠశాల సిబ్బందికి సూచనలు సలహాలు అందజేస్తున్న ఉప విద్యాశాఖ అధికారి ఎం.ఆనందరెడ్డి

మధ్యాహ్నం భోజన సమయంలో స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న తిరుపతి డివిజన్ ఉప విద్యాధికారి ఎం.ఆనందరెడ్డి

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి తానే పిల్లలకు వడ్డించి పిల్లలతోపాటు భోజనం తిన్నారు. పాఠశాల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఉపాధ్యాయులకు తగు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం సందర్శించారు. రికార్డ్స్ పరిశీలించారు. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించాలని అన్నారు. నాడు నేడు పనులపై సమీక్ష నిర్వహించారు. సిఆర్పీలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి “నాడు-నేడు” పనులు,బడి మానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించారు.


పీలేరు మండలం విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ లకు, సిఆర్పి లకు సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇస్తున్న DyEO ఆనంద రెడ్డి

పై కార్యక్రమంలో మండల విద్యాధికారి లోకేశ్వర్ రెడ్డి, ఎం.ఈ.ఓ-2 పద్మావతి, జడ్పీ ఉన్నత పాఠశాల కోటపల్లి(బాలికలు)
ప్రధానోపాధ్యాయులు రెడ్డిబాబు రెడ్డి, బోధనా సిబ్బంది మధులత, ఉదయశ్రీ, కృష్ణవేణి, నాగరాణి, లక్ష్మీదేవి, రామకృష్ణ, అలివేలు, సుధాకర్, అల్లా బక్షు, జయలక్ష్మి, రాధా, సుబ్రహ్మణ్యం, వ్యాయామ ఉపాధ్యాయులు రమణమ్మ, రేణుక, సిఆర్పీలు మురలిదర్ రాజు, అశోక్, నాగరాజు, మాధవి తదితరులున పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

గండబోయినపల్లిలో ఆనందోత్సవాల మధ్య నల్లారి బ్రదర్స్ జన్మదిన వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర వైభవోపేతంగా ముగింపు – ధన్యవాదాలు తెలుపిన ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment