Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో శ్రమదాన కార్యక్రమం

జానం న్యూస్, పీలేరు అక్టోబర్ 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ పురస్కరించుకొని గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ఒకరోజు ముందు అక్టోబర్ ఒకటో తేదీ “స్వచ్ తా హి సేవ” కార్యక్రమంలో భాగంగా “ఏక్ తారీక్-ఏక్ గంట-ఏక్ సాథి” నినాదంతో ఉదయం పది గంటల నుండి 11 గంటల వరకు స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల, కోటపల్లి(బాలురు) ఆవరణలో శ్రమదానం కార్యక్రమం జరిగింది. పిచ్చి మొక్కలు, ముళ్ళపొదలు తొలగించారు. జెసిబి పెట్టి క్రీడా మైదానాన్ని చదును చేపించారు. వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.శివ శంకరయ్య అధ్యక్షతన, జాతీయ రహదారులు, జి.ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగింది. పై కార్యక్రమాన్ని జి.వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, తిరుపతి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్  నిర్మించాలంటే మురికి కాలువలో చెత్త చెదారం వేయరాదు. మన ఇంటినే కాక పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ప్రతి ఇంటిలో మొక్కలను పెంచాలి కాలుష్యాన్ని నివారించాలి. మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారతావనిని నిర్మించే విధంగా మనమంతా ముందుకు వెళ్లాలని అన్నారు. క్లీన్ ఇండియా-గ్రీన్ ఇండియా గురించి వివరించారు. స్వచ్ఛభారతావని కోసం ప్రతిజ్ఞ చేయించారు.

పై కార్యక్రమంలో జి.వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా,పీఐయు, తిరుపతి, నాగేంద్రబాబు, టీమ్ లీడర్, జి.ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అదికారులు
కె.రవికుమార్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్,ఎల్.ఎన్ మాల్వియా, ఇంజినీర్,  పి. ప్రవీణ్, సీనియర్ మేనేజర్,డి.పాండురంగారావు, సీనియర్ మేనేజర్ సేఫ్టీ. పాఠశాల బోధన సిబ్బంది కె.జయచంద్రారెడ్డి, కె.సుదర్శన్,ఎం.బాబునాయక్, ఎస్.నాగరాజ రెడ్డి, జి.నాగరాజ, జి.అంజి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి
స్వర్ణలత, భవ్య, శివకుమారి, సుపద్రమ్మ, లక్ష్మీదేవి, ఎన్.సి.సి కోఆర్డినేటర్ వెంకటరమణ నాయక్, ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పాత బంధాలకు కొత్త ఊపిరి – వాల్మీకిపురం 1980 10th బ్యాచ్ మళ్ళీ కలుస్తోంది!

Dr. Gangi Reddy Janam Chief Editor-

రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ విజేత టి.హోత్రి శ్రీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

తహసిల్దార్ మహబూబ్ బాషా సేవలు మరువరానివి: పీలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మల్లెల, సీనియర్ పాత్రికేయులు జాకీర్ పఠాన్.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment