Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

అన్నమయ్య జిల్లా అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందు ఉంచడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: అన్నమయ్య జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం.

జానం న్యూస్, రాయచోటి సెప్టెంబర్ 30: అన్నమయ్య జిల్లాను ముందు ఉంచడంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు,సలహాలు అందించారు. ప్రభుత్వం అందించిన ఐ.ఎఫ్.పి ఎలక్ట్రానిక్ డివైస్ లను చక్కగా ఉపయోగించి విద్యార్థులకు ఉపయోగపడేలాగా బోధించాలని అన్నారు.
ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్లు తప్పనిసరిగా రాయాలి, విద్యార్థులకు ఇచ్చిన నోట్స్ లు, వర్క్ బుక్కులు కరెక్షన్ చేసి ప్రతి పదము సరిదిద్దాలని అన్నారు.రక్తహీనత ఉన్న విద్యార్థినులకు ప్రతిరోజు ఐ.ఎఫ్.ఏ టాబ్లెట్స్ రోజు రెండు పూటలా తినేటట్లు చేయాలి.

“నాడు-నేడు” పనులు వేగవంతం చేయాలి.
టాయిలెట్స్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రతిరోజు “నాడు-నేడు” పనులను నిబంధనలు మేరకు సందర్శించాలి. లోపాలు ఉంటే టికెట్ రూపంలో రైజ్ చేయాలి అన్నారు. పాఠశాలకు సెలవు అయినా కూడా “నాడు-నేడు” పనులు యధావిధిగా కొనసాగించాలి అని అన్నారు.
“నాడు-నేడు” కు కేటాయించిన డబ్బులు చాలకపోతే తనకు తెలిపిన యెడల వేరే పాటశాలల నుండి సర్దుబాటు చేసి “నాడు-నేడు” పనులకు అంతరాయం కలగకుండా చూస్తానని అన్నారు.

అక్టోబర్ 1వ తేదీన ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపుమేరకు అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో “ఏక్ దిన్-ఏక్ గంట” కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని అన్నారు. గ్రామంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు కలిసి పరిసరాలను పరిశుభ్రత చేయాలని, ఈ కార్యక్రమం ఒక ఉద్యమం లాగా చేపట్టాలని కోరారు.

ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రతివారం ఒక జిల్లాను తనిఖీ చేస్తారని వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక సందేశం ఇవ్వబడుతుందని అన్నారు. ఆ సందేశం యూట్యూబ్ లింకును ఉపాధ్యాయులకు షేర్ చేసుకొని వారి సందేశాన్ని విని  ఆచరించి విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అన్నమయ్య జిల్లా డీఈవో శ్రీరామ్ పురుషోత్తం  ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సుదీర్ఘ సూచనలు సలహాలు ఇచ్చారు.

అక్షర క్రమంలో అన్నమయ్య జిల్లా ముందుంది అలాగే ఆచరణ, అభివృద్ధిలో కూడా అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో ముందుండేలా చూసే బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన – 42 మందికి శస్త్రచికిత్సల ఎంపిక

Dr. Gangi Reddy Janam Chief Editor-

మత్తు వదిలితేనే భవిష్యత్తు బంగారం: డాక్టర్ బత్తుల రాయుడు

Dr. Gangi Reddy Janam Chief Editor-

బీఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం విజయవంతం 

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment