Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసరును కలిసిన జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా ఎస్.ఏ.కరీముల్లా ..

కడప, ఆగస్టు 14(జానం న్యూస్): అన్నమయ్య జిల్లా నూతన మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఇమ్రాన్ ను జిల్లా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎస్.ఏ.కరీముల్లా సోమవారం కడప  నందు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇందులో భాగంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించారు.
వక్ఫ్ బోర్డు అభివృద్ధికి సహకరించాలని ఆయనని కోరడం జరిగిందని,ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎస్.ఏ.కరిముల్లా తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్.ఏ.కరీముల్లా మాట్లాడుతూ జిల్లా మైనార్టీ సంక్షేమశాఖను సమన్వయం చేసుకొని ముస్లిం మైనార్టీల అభివృద్ధి,సంక్షేమానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు,దర్గాల అభివృద్ధికి శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇకపోతే మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి,మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి లు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎస్.గౌస్ బాషా,డైరెక్టర్ పాజూల్లా,హజరత్ ముక్తి అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

పీలేరు జనసేన పార్టీలో భారీగా చేరికలు, పట్టణం పురవీధుల్లో యువత బైక్ ర్యాలీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు జడ్పీ బాలికోన్నత పాఠశాల చరిత్రలో అపూర్వ ఘనత…. పదవ తరగతి ఫలితాల్లో 92% ఉత్తీర్ణతతో పాఠశాల విశేష విజయాన్ని నమోదు చేసిన విద్యార్థినులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరులో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment