Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

పీలేరు హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగి మృతి: కుటుంబానికి రూ. 23.61 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించిన మదిరి తేజేష్ ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం హెరిటేజ్ ఫుడ్స్ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ మెడిక్లయిమ్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా మంజూరైన రూ. 23,61,000/- విలువైన ఇన్సూరెన్స్ చెక్కును, మధురి తేజేష్ తల్లి శ్రీమతి ఎం. గీత గారికి హెరిటేజ్ ఫుడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సాంబమూర్తి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

పీలేరు, జూన్ 19(జానం న్యూస్):

ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ,

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తన ఉద్యోగుల సామాజిక భద్రతకు గట్టి కట్టుబాటుతో ముందుకు సాగుతోంది. ఉద్యోగుల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత. ఇటువంటి కష్టకాలాల్లో సంస్థ నుండి అన్ని విధాలా మద్దతు అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాము” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ గోపాలకృష్ణ, రీజనల్ హెడ్ సర్వోత్తమ్ రెడ్డి, ఏరియా మేనేజర్ ఆదినారాయణ, టెక్నో సర్వో ఇంచార్జి రామకృష్ణ, పీలేరు హెరిటేజ్ డెయిరీ మేనేజర్ శివశంకర్ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సంఘటన ఉద్యోగుల్లో ఆవేదనను కలిగించినప్పటికీ, సంస్థ అందించిన ఆర్థిక సహాయంతో వారి కుటుంబానికి కొంత ఆదరణ లభించింది.
హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం అమలుచేస్తూ, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తోందని.

Socal Share

Related posts

సీతారాం టాకీస్ వ్యవస్థాపకుడు కుమార్ రెడ్డి స్మారకార్థం అన్నదానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

నీట్ లో మెరిసిన ఆణిముత్యం బండపల్లి నేహా రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Prime Minister Narendra Modi launched “Mera Yuva Bharat Sangathan”.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment