Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

వాల్మీకిపురం పశువైద్యశాల ఏడి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం

మదనపల్లి సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా సేవలందిస్తున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీపై వాల్మీకిపురం ప్రాంతీయ పశువైద్యశాలకు ఏడీగా నియమితులయ్యారు. శనివారం ఆయన తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

వాల్మీకిపురం, జూన్ 14( జానం న్యూస్ ): మదనపల్లి సహాయ సంచాలకుల కార్యాలయంలో ఏడి (అసిస్టెంట్ డైరెక్టర్)గా సేవలందిస్తున్న డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి బదిలీపై వాల్మీకిపురం ప్రాంతీయ పశువైద్యశాలకు ఏడీగా నియమితులయ్యారు. శనివారం ఆయన తన బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా వాల్మీకిపురం మండలానికి చెందిన పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. గండబోయినపల్లి టిడిపి నాయకులు, రైతులు పులి సత్యనారాయణ రెడ్డి, కోటపల్లి ప్రభాకర్ రెడ్డి, విఠలం సురేష్ రెడ్డి, ఆరమడక బాబు రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అమరనాథ్ రెడ్డి, దొరబాబు రెడ్డి తదితరులు ఆయనకు శాలువా కప్పి, బొకే అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి గతంలో చింతపర్తి పశువైద్యశాలలో డాక్టర్‌గా పదకొండు సంవత్సరాల పాటు సేవలందించారు. ఆయన సేవలు విశేషంగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం బదిలీ ద్వారా మళ్లీ వాల్మీకిపురం మండలానికి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

గ్రామీణ వ్యవసాయ వ్యవస్థలో పశువైద్య సేవల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో వాల్మీకిపురం మండలంలో పశుసంపద అభివృద్ధికి మరింత బలపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

ఆంగ్లేయుల గుండెల్లో సింహ స్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు

Dr. Gangi Reddy Janam Chief Editor-

టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Skyline English Daily: Bridging the Gap between People and Government

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment