Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్భక్తి

వేడుకగా బ్రాహ్మణ సేవా సంఘ కార్తీక వన మహోత్సవం.

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 10:పీలేరు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా శివరామపురం నందు వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయము నందు కార్తీక వన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంలో ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం, గణపతి హోమం, రుద్ర హోమం, పూర్ణాహుతి, మంగళహారతి జరిగినది. స్వామివారి ఉత్సవిగ్రహములు ఉద్యా ఫణీంద్ర శర్మ ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా బయలుదేరి ఆలయమునకు వచ్చినవి. ఉదయం 10 గంటలకు శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగినది. తదుపరి సంఘ సర్వసభ్య సమావేశం, కార్తీక సమారాధన, సాంస్కృతిక కార్యక్రమములు లో భాగంగా పిల్లలతో ఆటలు ఆడించి, పాటలు,పద్యాలు,  గేయాలు పాడించి అందులో ప్రతిభ చూపిన వారికి బహుమతి ప్రధానం చేశారు.చివరిగా సాయంత్రం గార్గేయ నదిలో బ్రాహ్మణ కుటుంబాలచే కార్తీక దీపోత్సవం అత్యంత వైభవముగా జరిగినది.ఈ కార్యక్రమము నందు బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు తెనాలి శేషగిరిరావు, తెనాలి రామ సుబ్రహ్మణ్యం, ఉద్యా ఫణీంద్ర శర్మ , ఆలూరు ఆదినారాయణ శర్మ(తిరుపతి), ఇంజేటి రఘునాథరావు(నడిగడ్డ), విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి రెడ్డి సుబ్రమణ్యం, నరసింహమూర్తి, సంతోష్ కుమార్, వెంకటేశ్వర్లు (ప్రభుత్వ ఉపాధ్యాయులు), ఎల్ఐసి సుధాకర్, వి.కాశీనాథ్ శాస్త్రి, వి.మయూరినాథ్ శర్మ, కృష్ణ ప్రసాద్, చంద్రశేఖర్ స్వామి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

నీట్ లో మెరిసిన ఆణిముత్యం బండపల్లి నేహా రెడ్డి.

Dr. Gangi Reddy Janam Chief Editor-

సమర్థతకు ఆవార్డుతో సత్కారం… హిందీ ఉపాధ్యాయుడు బి.ఎస్ రాంబాబు కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

Dr. Gangi Reddy Janam Chief Editor-

తిరుపతిలో దేవాలయ స్వతంత్ర ప్రతిపత్తి కోసం భారీ జిల్లా సదస్సు – మార్చి 29న నిర్వహణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment