జానం న్యూస్, వాయల్పాడు, అక్టోబర్ 10: అన్నమయ్య జిల్లా, వాయల్పాడు మండలం, చింతపర్తి గ్రామ పంచాయతీలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త కోటపల్లి సనోంద్ర రెడ్డి స్వంత నిధులతో 4 కంప్యూటర్లు వితరణ చేయడం జరిగింది.
సనోంద్ర రెడ్డి కుమారుడు కోటపల్లి దేదీప్ రెడ్డి చేతుల మీదుగా కంప్యూటర్లు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బహుకరించడం జరిగింది.
గతంలో కుడా కోటపల్లి సనోంద్ర రెడ్డి చేతులమీదుగా లైబ్రరీ బుక్స్, స్పోర్ట్స్ కిట్స్, పిల్లల ఐడింటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.
ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఇలాగే ప్రతీ ఏడాది విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు వితరణ చేయడం జరుగుతుందని సనొంద్ర రెడ్డి అన్నారు.

తమ పాఠశాలకు కంప్యూటర్ల వితరణ చేసినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం కోటపల్లి సనోంద్ర రెడ్డి కుటుంబ సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు కే.నాగరాజ, ఉపాధ్యాయులు డి.వనజ, ఎన్.అనురాధ, ఎస్.యల్లప్ప, వి.శశికళ, వి.సుమలత, ఎఫ్.చంద్రశేఖర్ రెడ్డి మరియు వారి మిత్రులు యోగానంద రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

