Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

కార్పెంటర్స్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి.: రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పిఎస్ కుమార ఆచారి డిమాండ్.

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 9: ప్రభుత్వం కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు పి ఎస్ కుమార్ ఆచారి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్(హెచ్-195) ఇటీవల నూతన కమిటీ  ఎంపిక కావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా విజయవాడకు చెందిన తాటికొండ రంగబాబు, ప్రధాన కార్యదర్శిగా వైజాగ్ చెందిన కు చెందిన శరత్, కోశాధికారిగా నంద్యాలకు చెందిన షేక్ షంషీర్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన  నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు అభినందనలు తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ గతంలో పై అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్పెంటర్స్ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశామని అన్నారు. కొన్ని పరిష్కరింపబడ్డాయి. కానీ చాలా వరకు సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం రజకులకు, నాయి బ్రాహ్మణులకు, ఆటో కార్మికులకు పదివేల రూపాయలు చొప్పున ఇస్తున్నారని అలాగే కార్పెంటర్స్ కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్పెంటర్ కు కాలనీ ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. కార్పెంటర్స్ సమస్యలు పరిష్కరించే దిశగా అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.


PS Kumara Achari, రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్(హెచ్-195) నూతన రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబ(విజయవాడ), ప్రధాన కార్యదర్శి శరత్(వైజాగ్), కోశాధికారి షేక్ షంషీర్(నంద్యాల)

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

లంకను దాటించిన ప్రేమ

Jaanam News

బీఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం విజయవంతం 

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment