Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్క్రీడా వార్తలు

ఆటలో గెలుపు ఓటములు సహజం…అమరేంద్ర,సెక్రటరీ అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్

జానం న్యూస్, పీలేరు, అక్టోబర్ 20:
ఆటలో గెలుపు ఓటమిలో సహజమని అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ అమరేంద్ర అన్నారు.
పీలేరు నియోజకవర్గం, కెవి పల్లి మండల కేంద్రంలో బుధ, గురువారం రెండు రోజులు జరిగిన 6వ సబ్ జూనియర్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్-23 పోటీలలో అనంతపూర్ జిల్లా నుండి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. బాల బాలికల జట్లు హోరాహోరీగా పోరాడి సెమీ ఫైనల్ వరకు వెళ్లి వెనుదిరిగారు.వారు అనంతపూర్ కు తిరిగి వెళుతున్న క్రమంలో పీలేరు రైల్వేస్టేషన్లో అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అమరేంద్ర బృందం  స్థానిక మీడియాతో మాట్లాడారు.
అనంతపురం జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తూ బాలబాలికల జట్లు పై పోటీలలో పాల్గొని జాతీయ స్థాయి జట్లతో తలపడి, మంచి ప్రతిభ చూపి సెమీ ఫైనల్ వరకు వెళ్ళ గలిగారని అన్నారు. నెక్స్ట్ టైం విజేతలుగా నిలిచేందుకు తమ బాల బాలికల జట్లు కు తగినంత తర్పీదు ఇస్తామని అన్నారు.
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పై పోటీలు చాలా సంతృప్తికరంగా జరిగాయని, ఎలాంటి లోటుపాట్లు కలకుండా అన్ని సౌకర్యాలు కల్పించినందుకు జడ్.పి.టి.సి గజ్జల శృతి రెడ్డి, రాష్ట్ర షూటింగ్ బాల్ కార్యదర్శి  పరశురాముడు, రమణా రెడ్డి, నరేష్, నాగరాజ, కె.వి పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైవి రమణ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
పై కార్యక్రమంలో అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి ప్రసన్న కుమార్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అఖిల్, వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, సిద్ధ, ధనంజయ, బాల బాలికల జట్లు పాల్గొన్నారు.


పీలేరు రైల్వే స్టేషన్ నందు అనంతపూర్ జిల్లా షూటింగ్ బాల్ బాల బాలికల జట్లు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి

Dr. Gangi Reddy Janam Chief Editor-

జీవరాజ్ పాల్ వరప్రకాష్ ఔదార్యం – 23 మంది విద్యార్థుల చదువుకు వెలుగుదీపం

Dr. Gangi Reddy Janam Chief Editor-

విద్యార్థులకు ప్రోత్సాహంగా క్రికెట్ కిట్, విద్యా సామగ్రి పంపిణీ జానం సుజాత సేవా కార్యక్రమం ఆదర్శం

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment