Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్విద్య/ఉద్యోగాలు

నీట్ లో మెరిసిన ఆణిముత్యం బండపల్లి నేహా రెడ్డి.

జానం న్యూస్, (రాయచోటి), జూన్ 6:

నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం, నల్లగుట్టపల్లి గ్రామం కస్పాకు చెందిన బండపల్లి శ్రీరాములు రెడ్డి (రిటైర్డ్ హెడ్ మాస్టర్) మనమరాలు, అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లి మండలం, చౌటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న  బండపల్లి మధుసూదన్ రెడ్డి కుమార్తె బండపల్లి నేహా రెడ్డి 720 మార్కులకు 670 మార్కులు సాధించి నీట్ యూజీ (ఎంబీబీఎస్) 2024 ఫలితాలలో ఆలిండియా ఈ డబ్ల్యూ ఎస్ కోటలో 1651 వ ర్యాంక్ సాధించింది.ఈమె తల్లి బండపల్లి మేఘన రెడ్డి హౌస్ వైఫ్.  విజయవాడలోని శ్రీగోస్ లైట్స్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని కృషి పట్టుదలతో 670 మార్కులు సాధించి అటు తల్లిదండ్రులు, తనకు బోధించిన ఉపాధ్యాయ బృందానికి గర్వకారణమైంది. ఈ నెలలో  జరిగే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కోటాలో (ఎయిమ్స్ కాలేజీల్లో) సీట్ సంపాదిస్తానని, ఎంబీబీఎస్ తర్వాత చిన్న పిల్లల వైద్య నిపుణురాలు అవుతానని ఆకాంక్షను వ్యక్తం చేసింది. నేహా రెడ్డి పదవ తరగతి రాయచోటి శ్రీ చైతన్య పాఠశాలలో, ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్య గోశాల లో చదివింది.ఈ సందర్భంగా బండపల్లి నేహా రెడ్డి ని, ఆమె తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, మేఘన రెడ్డి లను శ్రీ చైతన్య విద్యాసంస్థల సిబ్బంది, పలువురు పుర ప్రముఖులు అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

సీతారాం టాకీస్ వ్యవస్థాపకుడు కుమార్ రెడ్డి స్మారకార్థం అన్నదానం

Dr. Gangi Reddy Janam Chief Editor-

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి: జానం సుజాత

Dr. Gangi Reddy Janam Chief Editor-

ఘనంగా “రెడ్డి సంక్షేమ సంఘం” అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment