Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్

ఘనంగా “రెడ్డి సంక్షేమ సంఘం” అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు.

జానం న్యూస్, (కలికిరి), జూన్ 10:
సోమవారం అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, కలికిరి పట్టణం, ధరణి హోటల్ సమీపంలో ‘రెడ్డి సంక్షేమ సంఘం’ అధ్యక్షుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి (సత్యా రెడ్డి) 50వ జన్మదిన వేడుకలు టపాసాల మోతలు, మిత్రులు శ్రేయోభిలాషులు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. 50 కిలోల కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పులి సత్యనారాయణ రెడ్డి నిగర్వి, నిరాడంబరుడు, నిస్వార్థుడు, బోలా శంకరుడు, సేవా తత్పరుడని కొనియాడారు.”మీ నిరాడంబర స్వభావం, నిస్వార్థం, ప్రజల పట్ల మీ ప్రేమ, మరియు సేవా స్పూర్తి సర్వత్రా ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతాము. మీ పుట్టినరోజు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంతో, శ్రేయస్సుతో గడవాలని ఆకాంక్షిస్తూ, మీకు మరెన్నో విజయాలు అందాలని, మరో అర్థ శతకం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలి” అని ఆకాంక్షించారు. పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తన 50వ పుట్టినరోజు వేడుకలను కలికిరి, వాయల్పాడు, గండ బోయినపల్లి లో అత్యంత ఘనంగా నిర్వహించిన అభిమానులు శ్రేయోభిలాషులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా హర్షనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పేదల సంక్షేమానికి, అభ్యున్నతికి, అభివృద్ధికి పాటుపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు పులి ధరణి కుమార్ రెడ్డి, ‘రెడ్డి సంక్షేమ సంఘం’ ఉపాధ్యక్షులు మరియు న్యాయవాది రాంప్రసాద్ రెడ్డి, సి.ప్రసన్న కుమార్ నాయుడు, జీ.జనార్దన్ రెడ్డి, ఎం.రాజారెడ్డి,శేష కుమార్ రెడ్డి, జగన్నాధ రెడ్డి,రామిరెడ్డి, బి.గంగిరెడ్డి, పి.రెడ్డెప్ప రెడ్డి, ఎం.శ్రీకాంత్ రెడ్డి, బి.సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి,జి.అమర నాద రెడ్డి, మోహన, మహేష్,బి.జనార్దన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణయ్య, ఆనంద, ఎం.శ్రీనివాసులు రెడ్డి, భీమ రాజు,టీ.శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

టీటీడీ వారి ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారమైన పీలేరు గణేష్ నిమజ్జనం వేడుకల సిడి ఆవిష్కరణ

Dr. Gangi Reddy Janam Chief Editor-

శ్రీ భువన విద్యాలయంలో ఘనంగా ముందస్తు దసరా నవరాత్రి వేడుకలు.

Dr. Gangi Reddy Janam Chief Editor-

JEE Mains‌లో రాష్ట్ర స్థాయిలో మెరిసిన V.S.N Siddhartha పూర్వ విద్యార్థులు

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment