Jaanamnews.in | Telugu News Channel News App
ఆంధ్రప్రదేశ్విద్య/ఉద్యోగాలు

పీలేరు ఏ.వి.ఆర్ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత  దినోత్సవం.

జానం న్యూస్, పీలేరు, డిసెంబర్ 22:స్థానిక ఏ.వి.ఆర్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులు తయారుచేసిన గణిత ఆకారాలు, కోణాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ప్రిన్సిపల్ పి.బి శోభ ప్రకాష్ మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవం అనేది భారతదేశంలోని వార్షిక ఆచారం. ఇది ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రజ్ఞులు మరియు గణిత ఔత్సాహికుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 22 న జరుపుకుంటారు. ఇది ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని సూచిస్తుంది. ఈ రోజు గణిత శాస్త్ర ప్రపంచానికి రామానుజన్ చేసిన అసమానమైన సేవలకు నివాళిగా ఉపయోగపడుతుంది. జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ యొక్క మేధావిని స్మరించడమే కాకుండా గణితంపై ప్రేమను ప్రేరేపిస్తుందని అన్నారు.గణితంలో ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారని అన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థి రామానుజన్ ను ఆదర్శంగా తీసుకొని గణితంలో పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పిలుపునిచ్చారు.ఉత్తమ గణిత నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. పై కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శ్యామల,గురునాధం, హరికృష్ణ , మెహ్రా, బోధన సిబ్బంది చంద్రయ్య, అంజలి ,వెంకటేష్, రెడ్డి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Socal Share

Related posts

అవశేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేస్తాను: జామకాయల కృష్ణమూర్తి

Dr. Gangi Reddy Janam Chief Editor-

రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ విజేత టి.హోత్రి శ్రీ

Dr. Gangi Reddy Janam Chief Editor-

పీలేరు పట్టణంలో ఉద్యమంగా సాగిన “స్వచ్ఛత హి సేవా” కార్యక్రమం.

Dr. Gangi Reddy Janam Chief Editor-

Leave a Comment